Hero Suman comments Pawan Kalyan: ఒకప్పుడు స్టార్ హీరో గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కి సైతం పోటీ ని ఇచ్చిన హీరో సుమన్(Suman). ఆ తర్వాత జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా సుమన్ జైలు పాలవ్వడం, జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయనకు సరైన బ్లాక్ బస్టర్స్ పడకపోవడం, వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ రావడం, అందువల్ల మార్కెట్ పోయి చిన్నగా హీరో రోల్స్ కి దూరం అవ్వడం జరిగింది. హీరో రోల్స్ కి దూరం అయ్యినప్పటికీ క్యారక్టర్ రోల్స్ ద్వారా మాత్రం అద్భుతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్నీ భాషల్లోనూ ఎన్నో రకాల పాత్రలు చేస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా అలరించాడు. ప్రస్తుతానికి సుమన్ రాజకీయాల్లో లేడు కానీ, అప్పుడప్పుడు ఆయన తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కామెంట్స్ చేస్తూ ఉంటాడు.
రీసెంట్ గా ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawa గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘దేవుడు ఏ తలరాత రాస్తే అది జరిగి తీరుతుంది. ఉదాహరణకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయనకీ రాజకీయాల్లో 5 దశాబ్దాల అనుభవం ఉందా ?, లేకపోతే వరుసగా వాళ్ళ కుటుంబం లో వాళ్లంతా రాజకీయ నేపథ్యం లో ఉన్నారా?, లేదే!. ఆయన టైం బాగుంది, ఆయనకీ రాసి పెట్టి ఉంది, అందుకే నేడు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మాములుగా గెలుస్తాడేమో అని అంతా అనుకున్నారు కానీ, డిప్యూటీ సీఎం అవుతాడని ఎవ్వరూ అనుకోలేదుగా?, ఏ జ్యోతిష్యుడు చెప్పాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని?, ఆయనకు రాసి పెట్టి ఉంది కాబట్టే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈరోజు ఆయన బ్రహ్మాండంగా పని చేస్తున్నాడు. తప్పులుంటే చెప్పండి, ఇప్పటి వరకు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గతంలో కూడా సుమన్ పవన్ కళ్యాణ్ గురించి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలను కూడా అభిమానులు అత్యధిక శాతం పాజిటివ్ గానే తీసుకుంటున్నారు కానీ, కొంతమంది అభిమానులు మాత్రం తప్పుగా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి ఈ స్థానం ఊరికే రాలేదని , ఎన్నో అవమానాలు, మరెన్నో ఛీత్కారాలు భరించి, గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ భయపడి పారిపోకుండా, జనాల తరుపున ఎన్నో పోరాటాలు చేసి, ఎన్నికల రణరంగం లో దూకి కష్టపడి పని చేయడం వల్లే ఆయన్ని జనాలు ఆదరించారని, అదృష్టం కచ్చితంగా కలిసొచ్చింది కానీ,అంతకు ముందు హార్డ్ వర్క్ ఉందని అంటున్నారు.