Homeఎంటర్టైన్మెంట్Hero Srikanth Launched Rudraveena Movie Song: హీరో శ్రీకాంత్ చేతులమీదుగా 'రుద్రవీణ' లోని 'బంగారు...

Hero Srikanth Launched Rudraveena Movie Song: హీరో శ్రీకాంత్ చేతులమీదుగా ‘రుద్రవీణ’ లోని ‘బంగారు బొమ్మ’ పాట విడుదల

Hero Srikanth Launched Rudraveena Movie Song: రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ”. ఈ చిత్రం లోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం

Hero Srikanth Launched Rudraveena Movie Song
Hero Srikanth Launched Rudraveena Movie Song

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి విల్ల సినిమాస్ బ్యానర్ పై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మించిన “రుద్రవీణ” టైటిల్ చాలా బాగుంది ఈ టైటిల్ మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన టైటిల్ .ఈ టైటిల్ చిరంజీవి అన్నయ్యకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటి సినిమాలోని పాటలు ఎంతో మ్యూజికల్ హిట్ గా నిలిచి పోయాయి. అలాంటి గొప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమానుండి విడుదలవుతున్న “బంగారు బొమ్మ” పాట విన్నాను. చాలా బాగా ఉంది. ఈ పాటలతో పాటు సినిమాలోని అన్ని పాటలు కూడా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరికి అల్ ద బెస్ట్ చెపుతున్నాను అన్నారు

చిత్ర నిర్మాతలు రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు మాట్లాడుతూ.. “రుద్రవీణ” సినిమా నుండి ఈ రోజు మొదటి సాంగ్ ను రిలీజ్ చేశాము. మాకు చిరంజీవి గారు అంటే ఎంతో ఇష్టం .అయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీ కి వచ్చి సినిమాలు తీస్తున్నాము. చిరంజీవి అన్నయ్యది ఎంత మంచి మనసో శ్రీకాంత్ గారు కూడా అంతే మంచి మనసున్న వ్యక్తి.. అయితే మేము మెగా ఫ్యామిలీది గోల్డెన్ హ్యాండ్ అని ఎలా భావిస్తామో వారి తరువాత శ్రీకాంత్ గారిది కూడా గోల్డెన్ హ్యాండ్ అని బావించి ఈ రోజు తన చేతుల మీదుగా విడుదల చేసిన ‘బంగారు బొమ్మ’ సాంగ్ మ్యూజికల్ హిట్ కాబోతుంది. దీన్ని మీరందరూ చూడబోతారు.సంగీత దర్శకులు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమా నుండి ముందు ముందు ఇంకా మంచి మంచి పాటలు వస్తాయి. ఈ సినిమాలో మా హీరో శ్రీ రామ్ నిమ్మల చాలా బాగా నటించడమే డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ఇందులో సిగ్నేచర్ స్టెప్స్ చాలా ఉన్నాయి. త్వరలో అయన స్టెప్స్ చూడబోతారు. దర్శకుడు మధుసూదన్ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాము. మోయిన్, రాజ్ పైడి లు చాలా బాగా కోరియోగ్రఫీ చేశారు.అలాగే హీరోయిన్స్ శుభశ్రీ, ఎల్సా, సోనియా ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మేము కచ్చితంగా చెప్పగలము ఇందులోని పాటలు విన్న తరువాత అడియన్స్ ఈ సినిమాను పెద్ద మ్యూజికల్ హిట్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు.

హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ.. ఈ రోజు నేను నటించిన “రుద్రవీణ” సినిమా నుండి ‘బంగారు బొమ్మ’ సాంగ్ ను హీరో శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం జరిగింది. వారికి నా ధన్యవాదములు.నేను ఈ రోజు ఈ పాట చూశాను. చాలా అమేజింగ్ గా ఉంది.దీన్ని యానాం లో షూట్ చేశాము. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. మహావీర్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో శ్రీ రామ్ నిమ్మల మాట్లాడుతూ.. మా “రుద్రవీణ” సినిమాలోని బంగారు బొమ్మ సాంగ్ ను హీరో శ్రీకాంత్ అన్న చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికీ మా ధన్యవాదాలు. అలాగే మా “రుద్రవీణ” సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పాటను కూడా మీరందరూ హిట్ చేయాలని కోరుతున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ మాట్లాడుతూ..ఈ మెలోడీ సాంగ్ కు రాంబాబు గోశాల గారు లిరిక్స్ రాశారు. ఈ పాటను అభయ్ జోద్భుర్ కర్ పాడడం జరిగింది.. వెరీ గుడ్ కంపో జింగ్, ఈ పాట సౌండ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

నటీ నటులు

శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ,రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు

సాంకేతిక నిపుణులు
సినిమా : “రుద్రవీణ”
సమర్పణ : రాగుల గౌరమ్మ
బ్యానర్ : సాయి విల్లా సినిమాస్
నిర్మాతలు : రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను
డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి
డి . ఓ. పి : జి. యల్ .బాబు
కోరియోగ్రఫీ :మొయిన్,రాజ్ పైడి
మ్యూజిక్ : మహావీర్
లిరిక్స్ : రాంబాబు గోశాల
ఎడిటర్ : బి. నాగేశ్వర్ రెడ్డి
ఆర్ట్ : భూపతి యాదగిరి
పి . ఆర్. ఓ : హరీష్ – దినేష్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular