Hero Simbu: ఆ సినిమా కోసం శింబు ఏకంకా ఎన్ని కిలోలు తగ్గారో తెలుసా?

Hero simbu: తమిళ స్టైలిష్​ స్టార్​ శింబు హీరోగా వెంకట్​ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూప్​. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. కాగా, ఈ సందర్భంగా శింబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర కామెంట్స్​ చేశాడు. ఈ సినిమాకు ముందు తన కెరీర్ చాలా డౌన్​లో ఉండేదని.. అందుకే తన ఆహార్యాన్ని మార్చుకునేందుకు చాలా హార్డ్​వర్క్​ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తనను తాను మార్చుకునేందుకు 27 […]

Written By: Raghava Rao Gara, Updated On : November 22, 2021 9:49 am
Follow us on

Hero simbu: తమిళ స్టైలిష్​ స్టార్​ శింబు హీరోగా వెంకట్​ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూప్​. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. కాగా, ఈ సందర్భంగా శింబు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ ఆసక్తికర కామెంట్స్​ చేశాడు. ఈ సినిమాకు ముందు తన కెరీర్ చాలా డౌన్​లో ఉండేదని.. అందుకే తన ఆహార్యాన్ని మార్చుకునేందుకు చాలా హార్డ్​వర్క్​ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా తనను తాను మార్చుకునేందుకు 27 కిలోలు తగ్గినట్లు పేర్కొన్నారు.

మద్యపానం మానేసి.. ఆహార అలవాట్లను మార్చుకుని.. అన్ని విషయాల్లో నిబద్దతతో ముందుకు సాగినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సినిమాలో తాను చాలా కొత్తగా కనిపించనున్నట్లు పేర్కొన్నారు. లూప్​ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కుదిరితే ఈ కథను స్ట్రయిట్​ తెలుగులో తెరకెక్కించాలనుకుంటున్నట్లు వివరించాడు. కాగా, ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న అల్లు అరవింద్​, బన్నీ వాసుకు కృతజ్ఞతలు తెలుపారు శింబు.

కాగా, ఇటీవలే తన సినిమా మానాడు ప్రీరిలీజ్​ ఈవెంట్​ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను తలుచుకుని.. శింబు స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తనకు ఎలాగైతే సపోర్ట్​గా నిలిచారో.. మున్ముందు కూడా అలాగే నిలబడాలని అబిమానులను కోరారు. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం రోరింగ్​ రెస్పాన్స్ లభించింది.  “అన్నా… మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ” అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు.