Simbu: ప్రముఖ తమిళ స్టార్ హీరో శింబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. కాగా, వెండు తనిందదు కాడు అనే షూటింగ్లో కొన్ని వారాల పాటు ఫుల్ బిజీగా గడుపుతున్నారు శింబు. ఈ క్రమంలనే వాతావరణం పడక జ్వరం, గొంతులో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

కరోనా ఏమైనా అయ్యుంటుందా అని పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ నిర్ధరణ అయ్యింది. సాధారణ ఇన్‌ఫెక్షనేనని వైద్యులు స్పష్టం చేశారు. శింబు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసి.. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. కాగా, తమిళ స్టార్‌గా గుర్తింపు పొందిన శింబు.. వల్లభ, మన్మధ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇటీవలే విడుదలైన మానాడు తెలుగులో ది లూప్ పేరుతో తీసుకొచ్చారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకుంది.
కాగా, ఇటీవలే తన సినిమా మానాడు ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా తాను ఎదుర్కొంటున్న సమస్యలను తలుచుకుని.. శింబు స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు తనకు ఎలాగైతే సపోర్ట్‌గా నిలిచారో.. మున్ముందు కూడా అలాగే నిలబడాలని అబిమానులను కోరారు. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం రోరింగ్ రెస్పాన్స్ లభించింది. “అన్నా… మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ” అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు.