https://oktelugu.com/

Hero Siddharth: ఏపీ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సంచలన ట్వీట్​

Hero Siddharth: తెలుగు తమిళంలో భాషలో స్స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానుల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు హీరో సిద్ధార్థ్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడానికి ముందుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్ధార్థ్ ఏపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు . https://twitter.com/Actor_Siddharth/status/1474064158509322259?s=20 టాలీవుడ్ పెద్దలు మొదటినుంచి సినిమా టికెట్ల ధరలను పెంచాలంటూ డిమాండ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 24, 2021 / 03:39 PM IST
    Follow us on

    Hero Siddharth: తెలుగు తమిళంలో భాషలో స్స్టార్ హీరోగా ఎంతో మంది అభిమానుల హృదయాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును పొందారు హీరో సిద్ధార్థ్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ తనదైన శైలిలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడానికి ముందుంటున్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సిద్ధార్థ్ ఏపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్లో కౌంటర్ వేశారు .

    https://twitter.com/Actor_Siddharth/status/1474064158509322259?s=20

    టాలీవుడ్ పెద్దలు మొదటినుంచి సినిమా టికెట్ల ధరలను పెంచాలంటూ డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదు ఈ క్రమంలో నిన్న ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు నాచురల్ స్టార్ నాని. “కిరాణా షాప్ కలెక్షన్ల కంటే థియేటర్ల కలెక్షన్లు తక్కువ అయిపోయాయి” అంటూ హీరో నాని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.అయితే నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు కూడా రీ కౌంటర్ ఇచ్చారు.

    Also Read: పాన్​ఇండియా కాన్సెప్ట్ ఫేక్​.. హీరో సిద్ధార్థ్​ సంచలన ట్వీట్​

    Hero Siddharth

    ఈ సందర్భంలో ఏపీ మంత్రులపై హీరో సిద్ధార్థ మండిపడ్డారు. “సినిమా పరిశ్రమలో పనిచేసే వాళ్లంతా ప్రభుత్వానికి లెక్కలతో సహా టాక్స్ లు కడుతున్నాం. రాజకీయ నాయకులు మాత్రం ఎలాంటి టాక్స్ లు లేకుండా విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. ప్రజల డబ్బును అన్యాయంగా అవినీతిగా దోచుకుంటున్నారు. మేము అలా కాదు మీ విలాసాలను తగ్గించుకుని మాకు సబ్సిడీలు ఇవ్వండి” అంటూ మంత్రులకు కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థ్.  మరి చూడాలి మరి సిద్ధార్థ్ కౌంటర్ కి ఏపీ మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో.

    Also Read: సమంత పాటపై శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..