Homeఎంటర్టైన్మెంట్Shivakartikeyan: ఈ స్టార్​ హీరో ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్​ ఎంతో తెలిస్తే షాక్​!

Shivakartikeyan: ఈ స్టార్​ హీరో ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్​ ఎంతో తెలిస్తే షాక్​!

Shivakartikeyan: రెమో, కౌసల్య కృష్ణమూర్తి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తమిళ స్టార్​ హీరో శివకార్తికేయన్​. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్​ హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో తెలుగు, తమిళ ప్రజలను పలకరిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్​ సంపాదించుకున్నాడు. కాగా, ఇటీవల వరుణ్​ డాక్టర్​ సినిమాతో పలకరించిన శివ.. బాక్సాఫీసు వద్ద మంచి టాక్​ అందుకున్నాడు.

shiva kartikeyan

ఈ క్రమంలోనే శివకార్తికేయన్ సినిమాలకు మార్కెట్​లో డిమాండ్​ పెరిగిపోయింది. ఈ క్రేజ్​తోనే భారీ రెమ్యునరేషన్​ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివకార్తికేయన్​ ఒక్కో సినిమాుక రూ.27కోట్లు నుంచి 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, తక్కువ టైమ్​లో ఇంత పారితోషకం డిమాండ్​ చేసే స్థాయికి శివకార్తికేయన్​ రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరోవైపు, అతనికున్న ఫ్యాన్​ఫాలోయింగ్​, క్రేజ్​ వల్ల మేకర్స్ కూడా అందుకు వెనక్కి తగ్గడంలేదట. ప్రస్తుతం శివకార్తికేయన్​ అయలాన్​, డాన్​ సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం అయలాన్​ షూటింగ్​ పూర్తి కాగా.. డాన్​ సెట్స్​పై నడుస్తోంది. కాగా, తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తొలిసారి కనిపించారు శివకార్తికేయన్​. త్వరలోనే పూర్తి తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

రెమో సినిమాతో మంచి క్రేజ్​ తెచ్చుకున్న శివకార్తికేయన్.. అందులో లేడీ గెటప్​ కూడా వేసి మెప్పించారు. కాగా, ఇందులో కీర్తి సురేశ్​ హీరోయిన్​గా నటించింది. మంచి రొమాంటిక్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular