Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్’. నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో హీరో రామ్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంతకీ రామ్ ఏమి మాట్లాడాడు. రామ్ మాటల్లోనే విందాం. ‘‘పోలీస్ పాత్ర చేయాలని నేను చాలా కథలు విన్నాను. నాకు ఎందుకో.. అన్నీ కథలు ఒకేలా అనిపించాయి. ఇక పోలీస్ పాత్ర వద్దనుకున్నాను. ఆ సమయంలోనే లింగుసామిగారు నా దగ్గరకు వచ్చారు. ‘ది వారియర్’ కథ చెప్పారు. ‘పోలీస్ కథ చేస్తే ఇలాంటిదే చేయాలి’ అనిపించింది.

ఈ సినిమాలో ఎమోషన్స్ అంత గొప్పగా ఉంటాయి. నా సినీ కెరీర్ లో నేను ఒక సినిమా కథ విన్నాక.. నేనెప్పుడూ ట్వీట్ చేసింది లేదు. కానీ మొదటిసారి ఈ సినిమా కోసం ట్వీట్ చేశాను. ఇలాంటి అద్భుతమైన కథ రాసిన ఆయనకి నేను హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇక మీరు (అభిమానులు) లేకుంటే నేను లేను. నా ఎనర్జీకి మీరే కారణం. నేను చాలా రోజుల తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేశాను.
Also Read: Megastar Chiranjeevi: అభిమానులకు చిరాకు రప్పిస్తున్న మెగాస్టార్ సరికొత్త నిర్ణయం
నా ఫ్యాన్స్ నుంచి వచ్చిన మెసెజ్ లు చదువుతూ ఉన్నా. ఫ్యాన్స్ లో కొందరు.. ‘అన్నా నువ్వేమి చేయొద్దు. ఈ సినిమా నుంచి మేమేమి ఆశించడంలేదు. నువ్వు ఎక్కువగా రిస్క్ తీసుకోవద్దు; అంటూ కామెంట్లు పెట్టారు. అప్పుడు అనిపించింది ఇది అభిమానుల అన్ కండిషనర్ లవ్ అని. అందుకే, మీరు (ఫ్యాన్స్) లేకపోతే నేను లేను’ అని రామ్ ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. రామ్ కన్నీళ్లకు ఫ్యాన్స్ ఎమోషన్సే మెయిన్ కారణం.
మొత్తానికి ‘ది వారియర్’ రూపంలో ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగించేలా రామ్ స్పీచ్ సాగింది. ఓ రకంగా రామ్ పై భారీ యాక్షన్ డ్రామాను రన్ చేయడం ఆషామాషీ విషయం కాదు. కానీ స్క్రీన్ ప్లే విషయంలో లింగుస్వామి ఎక్స్ పర్ట్. అందుకే.. ఈ సినిమా పై అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

పైగా ‘ది వారియర్’ సినిమాను ఒక సామాజిక మెసేజ్ ను హైలైట్ చేస్తూ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయట. అన్నిటికి మించి తన కెరీర్ లోనే మొదటిసారిగా రామ్ పక్కా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. అందుకే.. ఈ సినిమా విషయంలో రామ్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి విలన్‌గా నటించనున్నాడు.
Also Read:Pushpa 2: ‘పుష్ప 1’ కంటే ‘పుష్ప 2’లో సుకుమార్ సంచలన మార్పులు
[…] Also Read: Ram Pothineni: హీరో రామ్ కన్నీళ్లకు కారణమేంటి … […]