https://oktelugu.com/

Hero Raj Tarun : పెళ్లి పిల్లలు వద్దు ఒంటరిగా ఉండిపోతా… హీరో రాజ్ తరుణ్ మాటలకు అందరూ షాక్!

యంగ్ హీరో వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ మూవీలో హీరోయిన్ గా రాసి సింగ్ నటిస్తుంది. రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా మూవీ రూపొందుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 22, 2024 / 08:24 PM IST

    Hero Raj Tarun says he doesn't want children of marriage and will stay alone

    Follow us on

    Hero Raj Tarun : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ అసలు పెళ్లి చేసుకోను అంటున్నారు. లైఫ్ అంతా సింగిల్ గా ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన రాజ్ తరుణ్ అనూహ్యంగా హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ఉయ్యాలా జంపాలా , కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావ చిత్రాలతో వరుస హిట్లు కొట్టాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. వరుస ప్లాపులతో రేస్ లో వెనుక బడ్డాడు.

    ఇప్పుడు తిరిగి రాణించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ కాస్త స్ట్రగుల్ లో ఉన్నారు. హిట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్ తరుణ్ సోలో హీరోగా హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఇటీవల సంక్రాంతికి కి విడుదలైన నా సామి రంగ మూవీ లో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. కానీ .. ఆ క్రెడిట్ మొత్తం హీరో నాగార్జున ఖాతాలోకి వెళ్ళింది.

    రాజ్ తరుణ్ హీరోగా మూడు సినిమాలకు సైన్ చేసాడు. తిరగబడరా సామి, భలే ఉన్నడే, పురుషోత్తముడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కాగా తాజా ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు రాజ్ తరుణ్ స్పందిస్తూ .. ఏది ఏమైనా సరే జీవితంలో పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యానని చెప్పి షాక్ ఇచ్చారు.

    నాకు పెళ్లి, పిల్లలు వద్దు. నేను సింగల్ గా హ్యాపీగా ఉన్నాను. పెళ్లి విషయంలో మా నాన్న నా ఇష్టం అంటారు. మా అమ్మ మాత్రం మొదట్లో అడిగేది, ఇప్పుడు ఆమె కూడా వదిలేసిందని రాజ్ తరుణ్ తెలిపాడు. యంగ్ హీరో వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజ్ తరుణ్ అప్ కమింగ్ మూవీ పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఈ మూవీలో హీరోయిన్ గా రాసి సింగ్ నటిస్తుంది. రమేష్ కుడుముల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా మూవీ రూపొందుతుంది.