Prabhas Adipurush: ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా ముగిసింది. అక్టోబర్ 2న అయోధ్య వేదికగా విడుదల చేశారు. ఈ ఈవెంట్ కోసం చిత్ర యూనిట్ ప్రభాస్, కృతి సనన్, ఓమ్ రౌత్, భూషణ్ కుమార్ అయోధ్య వెళ్లారు. రాముని జన్మస్థలంలో టీజర్ విడుదల చేయడం ద్వారా దేశాన్ని ఆకర్షించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మీడియాతో మాట్లాడారు. ఆదిపురుష్ ప్రమోషన్స్ లో భాగంగా అయోధ్య రావడం జరిగింది. పనిలో పనిగా మాకు శ్రీరాముని ఆశీస్సులు దక్కాయి. భక్తి, ప్రేమ, భయంతో ఆదిపురుష్ మూవీ చేశాం. ఫలితం ఏమిటనేది ఆ శ్రీరాముని కృప.

శతాబ్దాలుగా ఆయన క్రమశిక్షణ అలవర్చుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అయితే అది మనకు సాధ్యం కాదు. రామునిలా మనం బ్రతకలేం. అందుకే రాముడు దేవుడు అయ్యాడు, మనం మనుషుల్లా మిగిలిపోయాం… అని ప్రభాస్ అన్నారు. అనంతరం సీత పాత్ర చేసిన కృతి సనన్ మాట్లాడారు. చాల కొద్దిమంది హీరోయిన్స్ కి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. నాకు చాలా త్వరగా సీతగా నటించే అదృష్టం దక్కింది. షూటింగ్ చివరి రోజు ఎమోషనల్ అయ్యాను. సెట్ వదిలి వెళ్లాలని అనిపించలేదు. ఇది అద్భుతమైన పాత్ర. ఈ సినిమా చేయడం ఇప్పటికీ కలలా అనిపిస్తుంది.
రామాయణ గాథను మనం చిన్నప్పుడు టీవీల్లో చూశాము. తాతయ్య నానమ్మలు కథలు కథలుగా చెప్పారు. రామాయణ కావ్యానికి వెండితెర రూపం ఇచ్చినప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా.. అని ఆమె వెల్లడించారు. ఇక విడుదలైన ఆదిపురుష్ టీజర్ మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకుంది.

విజువల్స్ పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో కార్టూన్ మూవీ తీశారేంటి అంటున్నారు. సీజీ వర్క్ చాలా నాసిరకంగా ఉంది. టీవీ సీరియల్స్ స్టాండర్డ్స్ ని తలపించాయి. ఆదిపురుష్ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కి గురవుతుంది. కనీసం ఫైనల్ అవుట్ ఫుట్ కొంచెం మెరుగ్గా ఇస్తే బాగుంటుందని మేకర్స్ ని కోరుకుంటున్నారు. ఆదిపురుష్ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
[…] […]