Hero Nithin: షూటింగ్ లో హీరో నితిన్ కి ప్రమాదం… ఆసుపత్రికి తరలింపు, కండీషన్ ఏంటంటే?

అక్కా తమ్ముడు సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. లేటెస్ట్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామంలో జరుగుతుంది.

Written By: NARESH, Updated On : January 11, 2024 10:15 am

Hero Nithin

Follow us on

Hero Nithin: హీరో నితిన్ ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందుతుంది. నితిన్ లేటెస్ట్ మూవీ షూటింగ్ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుండగా… ఆయనకు గాయాలయ్యాయట. హీరో నితిన్ ని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే… నితిన్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ తమ్ముడు టైటిల్ తో ఒక మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. కొన్నాళ్లుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.

అక్కా తమ్ముడు సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కుతున్న నేపథ్యంలో చిత్రానికి తమ్ముడు అనే టైటిల్ ఫిక్స్ చేశారట. లేటెస్ట్ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి గ్రామంలో జరుగుతుంది. నితిన్ పై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో నితిన్ ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ ఆపివేసిన యూనిట్… వెంటనే ఆసుపత్రికి తరలించారు.

వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారట. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నితిన్ కి గాయాల నేపథ్యంలో తమ్ముడు షూటింగ్ కి బ్రేక్ పడింది. మరోవైపు నితిన్ హిట్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. 2020లో వచ్చిన భీష్మ అనంతరం నితిన్ కి మరలా హిట్ లేదు. గత ఏడాది నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదలైంది.

ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సైతం నిరాశపరిచింది. ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. దీంతో తమ్ముడు చిత్రం మీదే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఉన్నాయి. ఇక వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ మూవీక తెరకెక్కించాడు.