https://oktelugu.com/

Hero Nithin Birthday Special: హ్యాపీ బర్త్ డే నితిన్… తెలంగాణ రెండో కథానాయకుడు

Hero Nithin Birthday Special: నితిన్.. పడిలేచిన కెరటం.. ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే హీరోల్లో నితిన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘ధైర్యం’గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘హీరో’గా తొలి చిత్రంతో వి‘జయం’ సాధించి.. ప్రేక్షకుల ‘దిల్’ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న హీరో నితిన్. గతేడాది ‘రంగ్ దే’ మూవీతో పర్వాలేదనిపించిన ఈయన త్వరలో మాచర్ల నియోజకవర్గం’ అనే […]

Written By:
  • Shiva
  • , Updated On : March 30, 2022 / 01:37 PM IST
    Follow us on

    Hero Nithin Birthday Special: నితిన్.. పడిలేచిన కెరటం.. ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం, హీరో అవ్వాలని ఆశ పడే కుర్రాళ్లకు నిజమైన ఆదర్శం. ప్రతి అవకాశంలోనూ ప్రతిభను కనబరచాలని చూసే హీరోల్లో నితిన్ పేరు కచ్చితంగా ఉంటుంది. ‘ధైర్యం’గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. ‘హీరో’గా తొలి చిత్రంతో వి‘జయం’ సాధించి.. ప్రేక్షకుల ‘దిల్’ లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న హీరో నితిన్.

    Hero Nithin

    Hero Nithin

    గతేడాది ‘రంగ్ దే’ మూవీతో పర్వాలేదనిపించిన ఈయన త్వరలో మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ రోజు నితిన్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం.

    Hero Nithin

    మీకు తెలుసా ? తెలంగాణ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో.. కాంతారావు తర్వాత హీరోగా నిలదొక్కుకున్న హీరో నితినే. 1983 మార్చి 30న నితిన్ జన్మించాడు.

    Hero Nithin

    నితిన్ ది నిజామబాద్ జిల్లా, ఆయన తండ్రి పేరుసుధకర్ రెడ్డి. నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన. ఎలాగూ కుటుంబంలో సినిమా వాతావరణం ఉంది కాబట్టి.. నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నితిన్ చిన్నప్పటి నుంచి హీరో కావాలనే ఆశ పడ్డాడు.

    Hero Nithin

    డైరెక్టర్ తేజ.. నితిన్ ని చూసి హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. వెనకాల నితిన్ తండ్రి సపోర్ట్ కూడా ఉంది. దాంతో నితిన్ కి హీరోగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. పైగా జయంతో మొదటి విజయం సాధించాడు.

    జయం సినిమా సక్సెస్ తర్వాత ఇండస్ట్రీ మొత్తం నితిన్ గురించే మాట్లాడుకుంది. దీనికితోడు వి.వి వినాయక్ తో చేసిన దిల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో హీరోగా నితిన్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు.

    Hero Nithin

    ఆ తర్వాత వచ్చిన సంబరం, శ్రీఆంజనేయం లాంటి సినిమాలు కూడా బాగానే ఆడాయి. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళి తీసిన ‘సై’ సినిమా నితిన్ కు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టింది.

    Hero Nithin

    కాకపోతే ఆ తర్వాత నితిన్ పది సినిమాలకు పైగా ప్లాప్స్ ను అందుకున్నాడు. మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఎన్ని ప్లాప్ లు వచ్చినా తనలోని ప్రతిభనే నమ్ముకొని హీరోగా సక్సెస్ అయిన అసలు సిసలు హీరో నితిన్.

    తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకునే హీరోలు అతి తక్కువగా ఉన్న ఈ జనరేషన్ లో నితిన్ లాంటి విభిన్నమైన చిత్రాలు అందించే హీరో ఉండటం నేటి ప్రేక్షకుడు చేసుకున్న అదృష్టం.

    ఇప్పటికీ వరుసగా వస్తున్న విజయాల్ని చూసి పొంగిపోకుండా నేటికీ విలక్షణమైన పాత్రల కోసం తాపత్రయ పడటం నితిన్ దినచర్య. నేడు నితిన్ పుట్టిన రోజు. ఓకే తెలుగు తరుపున ఆయన ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు.

    Also Read: RRR 5th Day Collections: అదే విజృంభణ.. బాక్సాఫీస్ ను తొక్కుకుంటూ పోయింది

    Tags