Nikhil Siddhartha: ఈ దేశం లో స్వేచ్ఛ అనేది లేదు అంటూ హీరో నిఖిల్ షాకింగ్ కామెంట్స్..రామ్ చరణ్ వల్ల నిఖిల్ ఇన్ని కష్టాల్లో చిక్కుకున్నాడా!

ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన తర్వాత ఆయన అస్తికలు ఏమయ్యాయి అనే దానిపై పరిశోధనలు చేసే స్పై గా నిఖిల్ ఈ చిత్రం లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ కాన్సెప్ట్ పై సినిమా రాలేదు, అలాంటి అంశాన్ని ఎంచుకున్నాడు నిఖిల్.

Written By: Vicky, Updated On : June 19, 2023 11:01 am

Nikhil Siddhartha

Follow us on

Nikhil Siddhartha: విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్న హీరో నిఖిల్. ఆయన లేటెస్ట్ గా చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి. కార్తికేయ 2 తో పాన్ ఇండియన్ మార్కెట్ దున్నేసిన నిఖిల్ ఇక నుండి తన రేంజ్ ని పెంచుకునే విధంగానే సినిమాలు చెయ్యడానికి సిద్ధపడ్డాడు. రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన చిత్రం ‘స్పై’.

ఈ నెల 29 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన తర్వాత ఆయన అస్తికలు ఏమయ్యాయి అనే దానిపై పరిశోధనలు చేసే స్పై గా నిఖిల్ ఈ చిత్రం లో కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఈ కాన్సెప్ట్ పై సినిమా రాలేదు, అలాంటి అంశాన్ని ఎంచుకున్నాడు నిఖిల్.

ఇందుకోసం ఆయన మూవీ టీం తో కలిసి ఎంతో రీసెర్చ్ కూడా చేసాడట. ప్రెతిష్ఠాత్మకంగా తీసుకొని చేసిన ఈ చిత్రాన్ని జూన్ 29 వ తారీఖున విడుదల చేయబోతున్నట్టు నిన్న ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేసాడు. దానికి ఒక నెటిజెన్ క్వాట్ చేస్తూ ‘ప్రోపగండా స్టార్’ అని కామెంట్ చేసాడు. దీనికి నిఖిల్ చాలా సీరియస్ రియాక్షన్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నేషనల్ ప్రైడ్ అనేది సమస్యనా?, ఈ దేశం లో అందరూ నమ్మే ప్రోపగండా స్వతంత్ర దేశం. దానిని నేను బలంగా నమ్ముతున్నాను’ అంటూ కామెంట్ చేసాడు. అంటే ఆయన ట్వీట్ కి అర్థం, ఫ్రీడమ్ అనేది ఈ దేశం లో లేదని, దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిఖిల్ మీద ఇలా నెగటివిటీ రావడానికి కారణం వీర్ సావర్కర్ బయోపిక్ చెయ్యడమే. రామ్ చరణ్ నిర్మాణ సంస్థలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు నుండి నిఖిల్ నెగటివిటీ ఎదురైంది. ఎందుకంటే సావర్కర్ దేశ ద్రోహి అని నమ్మేవాళ్ళు ఉన్నారు, అలాగే దేశ భక్తుడు అని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ఆయనని దేశ ద్రోహి అని నమ్మేవాళ్ల దగ్గర నుండి నిఖిల్ కి నెగటివిటీ ఎదురు అవుతుంది.