https://oktelugu.com/

Rakesh Master: నా శవాన్ని కూడా ముట్టుకోవద్దన్న రాకేష్ మాస్టర్… శిష్యుడు శేఖర్ మాస్టర్ తో గొడవేంటి?

రాకేష్ మాస్టర్ కెరీర్లో వందల మందికి డాన్స్ నేర్పారు. ఆయన శిష్యుల్లో శేఖర్ మాస్టర్ ఒకడు. శేఖర్ మాస్టర్ కెరీర్ మొదలైంది రాకేష్ మాస్టర్ వద్దే. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా చేరి డాన్సులో మెళకువలు నేర్చుకున్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : June 19, 2023 / 11:21 AM IST

    Rakesh Master

    Follow us on

    Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ ఆదివారం కన్నుమూశారు. వారం రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాకేష్ మాస్టర్ పరిస్థితి విషమించింది. మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం చివరి నిమిషంలో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యారని, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కి గురై కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

    రాకేష్ మాస్టర్ కెరీర్లో వందల మందికి డాన్స్ నేర్పారు. ఆయన శిష్యుల్లో శేఖర్ మాస్టర్ ఒకడు. శేఖర్ మాస్టర్ కెరీర్ మొదలైంది రాకేష్ మాస్టర్ వద్దే. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా చేరి డాన్సులో మెళకువలు నేర్చుకున్నాడు. అంచలంచెలుగా ఎదిగి స్టార్ కొరియోగ్రాఫర్ అయ్యాడు. కనీసం తిండి కోసం ఇబ్బంది పడ్డ రోజులు గురు శిష్యులుగా వారు అనుభవించారు. రాకేష్ మాస్టర్ సొంత తమ్ముడు మాదిరి శేఖర్ ని చేరదీశాడట. మరి ఇంత అనుబంధం ఉన్న శేఖర్, రాకేష్ మాస్టర్ ఎందుకు విడిపోయారు. వారి మధ్య గొడవలకు కారణం ఏమిటీ?

    దీనిపై పలు ఇంటర్వ్యూలలో ఇద్దరూ స్పందించారు. శేఖర్ మాస్టర్ కి చిరంజీవి నటించిన ఖైదీ 150 మూవీలో రెండు సాంగ్స్ కి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ విషయాన్ని రాకేష్ మాస్టర్ కి చెప్పకుండా దాచాడు. అది రాకేష్ మాస్టర్ ని మానసిక వేదనకు గురి చేసింది. నా దగ్గర డాన్స్ నేర్చుకుని ఎదిగిన శేఖర్ కి బ్రేక్ వస్తే నాకు చెప్పలేదని రాకేష్ మాస్టర్ బాధపడ్డాడు. అది వారి మధ్య దూరం పెరగడానికి కారణమైన సంఘటన.

    వాడిని సొంత బిడ్డలా భావించాను. కానీ నన్ను మోసం చేశాడు. వాడు ఎదిగినందుకు నాకు సంతోషం. అయితే వాడిని నేను ఇక కలవను. నేను చస్తే నా శవాన్ని కూడా తకొద్దని చెప్పాను, అని రాకేష్ మాస్టర్ గతంలో అన్నారు. రాకేష్ మాస్టర్ ఆరోపణలకు వివరణ ఇస్తూ… శేఖర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాకు పని చేస్తానని నాకు కూడా క్లారిటీ లేదు. పూర్తిగా స్పష్టత వచ్చాక చెప్పాలి అనుకున్నాను. కానీ రాకేష్ మాస్టర్ తాగి నా తల్లిని, భార్యను తిట్టాడని చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది.