Amit Shah- Nikhil: ఈమధ్య కాలం లో బీజేపీ అగ్ర నాయకులు టాలీవుడ్ హీరోలను కలవడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది..మొన్ననే అమిత్ షా గారు #RRR లో ఒక హీరో గా నటించిన జూనియర్ ఎన్టీఆర్ ని కలిసిన సంగతి మన అందరికి తెలిసిందే..హైదరాబాద్ వచ్చినప్పుడు అమిత్ షా ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించారు..ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది..అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ పరిశ్రమలోనూ ఈ భేటీ కి ముఖ్య కారణం ఏమిటి అని ఇప్పటికి ఆరాలు తీస్తూనే ఉన్నారు..ఇక ఆ తర్వాత బీజేపీ ముఖ్య నాయకుడు జేపీ నడ్డా గారు కూడా ఇటీవలే హీరో నితిన్ ని కలిశారు..ఇప్పుడు తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మరో వార్త ఏమిటి అంటే అమిత్ షా గారు హీరో నిఖిల్ ని కలవబోతున్నారట..సెప్టెంబర్ 17 వ తేదీన అమిత్ షా గారు హైదరాబాద్ కి వస్తున్నా సందర్భంగా నిఖిల్ ని డిన్నర్ కి ఆహ్వానించినట్టు సమాచారం.

ఇటీవలే అమిత్ షా గారు నిఖిల్ లేటెస్ట్ చిత్రం కార్తికేయ 2 ని చూశాడని..కృష్ణుడి గొప్పతనం గురించి అంత అద్భుతంగా చూపించడం ఆయనకీ ఎంతగానో నచ్చిందని..అలాంటి సినిమాలను ప్రోత్సహించి నటించినందుకు నిఖిల్ ని ప్రత్యేకంగా పిలిచి అభినందించనున్నారని తెలుస్తుంది..కార్తికేయ 2 చిత్రం కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు..బాలీవుడ్ లో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అనే విషయం మన అందరికి తెలిసిందే.
Also Read: NBK 107 Pre Release Business: టైటిల్ కూడా ఖారారు కాకముందే 80 కోట్లు కొల్లగొట్టిన బాలయ్య బాబు

ఈ సినిమా అక్కడ ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి ఇప్పటికి విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తుంది..బాలీవుడ్ లో ఎన్ని కొత్త సినిమాలు విడుదలవుతున్న కూడా కార్తికేయ 2 మేనియా ని ఆపలేకున్నాయి అంటే ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన హీరో నిఖిల్..ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా, దేశానికీ ప్రెసిడెంట్ అయినా అమిత్ షా వంటి వారు కూడా ఆయనని ప్రత్యేకంగా డిన్నర్ కి పిలిచే రేంజ్ కి ఎదగడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.
Also Read:Pelli Choopulu: ‘పెళ్లి చూపులు’ సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు