Homeఎంటర్టైన్మెంట్Hero Nikhil Divorce: విడాకులు తీసుకుంటున్న హీరో నిఖిల్..? ఇంస్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేశారంటే...

Hero Nikhil Divorce: విడాకులు తీసుకుంటున్న హీరో నిఖిల్..? ఇంస్టాగ్రామ్ లో ఏం పోస్ట్ చేశారంటే !

Hero Nikhil Divorce: ఈ రోజుల్లో విడాకులు చాలా మామూలు విషయం. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న జంటలు ఆ అప్పు తీరకముందే విడిపోతున్నారు. పెళ్లి పందిరి విప్పక ముందే మూడు ముళ్ళు విప్పేస్తున్న జంటలు ఎందరో. సర్దుకుపోయే వ్యవహారం అసలు ఉండటం లేదు. మొగుడు పెళ్ళాలు ప్రయోజకులు కావడంతో ఒకరిపై మరొకరు ఆధారపడే పరిస్థితి లేదు. దీంతో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాదు ఇద్దరం సమానం అంటున్నారు. విడిపోయినా బ్రతకగలమనే భరోసా ఉన్న నేపథ్యంలో చిన్న విషయాలకు కూడా ‘లెట్స్ బ్రేకప్’ అంటున్నారు. ఇక సినిమా వాళ్ళ సంగతి సరే సరి.

Hero Nikhil Divorce
Hero Nikhil Divorce

ఈ మధ్య కాలంలో నాలుగైదు సెలబ్రిటీ జంటలు విడిపోయారు. సమంత-నాగ చైతన్య, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్- కిరణ్ రావు ఏడాది వ్యవధిలో విడాకులు తీసుకోవడం జరిగింది. తాజాగా యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ విడాకులు సిద్ధమయ్యారనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కెరీర్ జోరుగా ఉంది, ఆయనకేం సమస్య వచ్చిందని జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. కెరీర్ సక్సెస్ ట్రాక్ లో వెళ్తున్నప్పటికీ వ్యక్తిగత సమస్యలు చుట్టుముట్టాయన్న పుకార్లు తెరపైకి వచ్చాయి. భార్య పల్లవితో గొడవలు పడుతున్న నిఖిల్… విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నారట. పల్లవి- నిఖిల్ ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారనేది ఆ వార్తల సారాంశం.

అయితే ఇవన్నీ పుకార్లే అని పరోక్షంగా నిఖిల్ హింట్ ఇచ్చాడు. భార్య పల్లవితో దిగిన ఫోటో షేర్ చేసిన నిఖిల్ ”మనిద్దరం కలిసుంటే ఆ ఆనందమే వేరు” అని రొమాంటిక్ కామెంట్ పోస్ట్ చేశారు. దీంతో నిఖిల్-పల్లవి విడాకుల వార్తల్లో నిజం లేదని, ఇవన్నీ గాలివార్తలని తేలిపోయింది. 2020 మే 14న లాక్ డౌన్ సమయంలో నిఖిల్ వివాహం జరిగింది. లాక్ డౌన్ లో ఆంక్షల మధ్య పెళ్లి చేసుకున్న మొదటి హీరో నిఖిల్ కావడం విశేషం. వృత్తిరీత్యా పల్లవి డాక్టర్.

Hero Nikhil Divorce
Hero Nikhil Divorce

మరోవైపు నిఖిల్ హీరోగా రెండు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అనుపమపరమేశ్వరన్ తో కలిసి 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సుకుమార్ శిష్యుడు పలనాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నారు. సుకుమార్, బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 తో బ్లాక్ బస్టర్ ఇచ్చిన నిఖిల్-అనుపమ కాంబినేషన్ రిజల్ట్ రిపీట్ చేస్తారేమో చూడాలి. అలాగే స్పై టైటిల్ తో పాన్ ఇండియన్ మూవీ ప్రకటించారు. ఈ థ్రిల్లర్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సమాచారం.

వైఎస్సార్ భజన చేసిన బాలయ్య || Balakrishna About YS Rajasekhara Reddy In Unstoppable Show || Aha
Pawan Kalyan Fans Donate 1 Crore To Janasena Party Through Jalsa Special Shows || Pawan Fans
పూరీ, ఛార్మీ లను విచారించిన ఈడీ || ED Investigation On Puri Jagannadh And Charmi || Liger Movie

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version