https://oktelugu.com/

Nikhil: షాకింగ్ : క్రేజీ హీరో తండ్రి కన్నుమూత !

Nikhil: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. హీరో నిఖిల్ కి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐతే, నేడుహైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడవడం సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది. తండ్రిని పోగొట్టుకున్న నిఖిల్ కి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. నిఖిల్ విజయ గమనంలో ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ […]

Written By:
  • Shiva
  • , Updated On : April 28, 2022 / 04:55 PM IST
    Follow us on

    Nikhil: తెలుగు చిత్రసీమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. హీరో నిఖిల్ కి పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఐతే, నేడుహైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడవడం సన్నిహితులను తీవ్రంగా కలిచివేసింది.

    Nikhil

    తండ్రిని పోగొట్టుకున్న నిఖిల్ కి పలువురు సినీ ప్రముఖులు ఫోన్లు చేసి పరామర్శిస్తున్నారు. నిఖిల్ విజయ గమనంలో ఆయన తండ్రి ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’ పాత్ర చాలా కీలకమైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా నిఖిల్ కుటుంబ సభ్యులకు అభిమానులు, సన్నిహితులు, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: Pavan Kalyan Last Movie: పవన్ కళ్యాణ్ ఆఖరి మూవీ అదేనా..?

    అదేంటో గాని.. ఈ 2022 చిత్ర పరిశ్రమకు అసలు కలిసి రావడం లేదు. కరోనా కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇటీవలే మహేష్ బాబు అన్న రమేష్ బాబు, కందికొండ, దర్శకుడు శరత్ కూడా ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఇప్పుడు నిఖిల్ తండ్రి కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమైన విషయం.

    Nikhil

    మా  ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ‘కావలి శ్యామ్ సిద్ధార్థ’   గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ,  శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

    Also Read:Acharya: ఆచార్య లో ఆ సన్నివేశం కి ఏడుపు ఆపుకోలేమా..?

    Recommended Videos:

    Tags