Snake Island: కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి అని కథలు చెబుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం పాములే ఉంటాయి. పాములంటే మామూలువి కాదు విషసర్పాలు. కొన్ని వేల సంఖ్యలో ఆ దీవిలో ఉండటంతో అక్కడకు వెళ్లాలంటే భయమే. పాములంటే అందరికి హడలే. అవి కనిపిస్తే చాలు పరుగులు పెట్టడమే. అంత భయపెడతాయి. వాటి బుసలు వింటే అంతే సంగతి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం తెలిసిందే. పాముల కోసం ఓ దీవి ఉండటం మాత్రం విశేషం.

బ్రెజిల్ లోని సావోపా లో పాముల కోసం ఓ ఐలాండ్ ఉంది. అక్కడ ఎటు చూసినా పాములే కనిపిస్తాయి. అందుకే అక్కడికి ఎవరు వెళ్లే సాహసం చేయరు. ఒకవేళ వెళ్లినా తిరిగిరారు. దీంతో ఇక్కడి విషసర్పాల గురించి చెబుతుంటే ఒళ్లు జలదరిస్తుంది. వాటి పేరు వింటేనే భయం కలుగుతుంది. అంతటి భయంకరమైన పాములకు ఓ ఆవాసం ఉంది. అక్కడకు వెళితే అంతే సంగతి. అందుకే ఎవరు కూడా వాటి స్థావరానికి వెళ్లే సాహసం చేయరు. ఈ దీవి సావోపా నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
Also Read: Drunken Female Teacher: మద్యం తాగి పాఠశాలకు వచ్చిన టీచర్.. ఆ తర్వాత ఏం చేసిందో తెలుసా?
ఈ ద్వీపంలో అత్యంత ప్రమాదకరమైన విషసర్పాలు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాల పాములున్నాయి. ఇవి ఎగిరే పక్షులపై కూడా దూకి కాటేసి చంపేస్తాయి. దీంతో పక్షులు కూడా అటు వైపు వెళ్లేందుకు జంకుతాయి. యాత్రికులకు ప్రవేశం లేదు. మనుషులను అక్కడికి వెళ్లనివ్వరు. పాములతో ప్రమాదం పొంచి ఉన్నందున అటు వైపు వెళ్లేందుకు జంకుతున్నారు. ఇల్హా క్విమడా గ్రాండె ద్వీపంలో పాముల స్థావరం ఉండటంతో ఎవరు కూడా అటు వెళ్లరు. దీంతో వాటికి సంబంధించిన స్థావరంగానే ఈ ప్రాంతం పేరు పొందింది.

బ్రెజిల్ లోని చరిత్రకారులు అప్పుడప్పుడు ఈ స్థలాన్ని సందర్శించినా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పూర్వం రోజుల్లో కొందరు అక్కడ ఉండాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో ప్రస్తుతం అటు ఎవరు కూడా పోవడానికి సాహసించడం లేదు. పాములను చంపేవారు వస్తున్నారని అనేక పుకార్లు వచ్చినా వాటికి ఏ మాత్రం ప్రమాదం లేదని తెలుస్తోంది. ఎందుకంటే అక్కడకు వెళితే ప్రాణాలతో తిరిగి రావడం కష్టమే. దీంతోనే పాముల స్థావరానికి ఎవరు వెళ్లడానికి ఇష్టపడరు. మొత్తానికి పాముల స్థావరంగా పిలవబడే ఇక్కడకు ఎవరు వెళ్లరనేది తెలిసిందే.
Also Read:Condom Addiction: యువత కండోమ్ ల పిచ్చి.. ఎగబడి కొంటున్నారట?
[…] […]