Balakrishna And Navdeep: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. నందమూరి నటసింహం గా తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…ఈయన సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగి ముందుకు సాగుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్ని ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలతో భారీ విజయాలను సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం పలు రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా బాలయ్య వరుసగా నాలుగు విజయాలతో పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు కూడా సక్సెస్ లను సాధించే సినిమాలుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకొని ముందుకు సాగుతున్నాడు…
Also Read: ఆ స్టార్ రైటర్ ను కలిసిన పూరి జగన్నాధ్ ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడా..?
ఇక బాలయ్య బాబు సినిమాలో నటించడానికి చాలామంది నటులు ఆసక్తి చూపిస్తున్నప్పటికి ఒక నటుడు మాత్రం ఆయన సినిమాలో చేయాలి అనగానే భయపడిపోయాడట. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఆ సినిమా ఏంటి అంటే బాలయ్య బాబు హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాలో ఒక కీలకపాత్రలో నవీన్ చంద్ర (Naveen Chandra) నటించాడు.
అయితే నవీన్ చంద్ర కంటే ముందు ఆ పాత్ర కోసం నవదీప్ (Navadeep) ని అడిగారట. బాలయ్య బాబు సినిమా కాబట్టి ఏదైనా తేడా వస్తే ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఆయన బాలయ్య బాబుకు భయపడి ఆ క్యారెక్టర్ ని రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక ఆ తర్వాత నవీన్ చంద్రతో ఆ క్యారెక్టర్ ని చేయించారు. మొత్తానికైతే ఆ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు రావడమే కాకుండా నవీన్ చంద్ర కి ఒక స్పెషల్ ఐడెంటిటి కూడా ఏర్పడింది. మొత్తానికైతే ఈ సినిమాలతో బాలయ్య మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు… మొత్తానికైతే బాలయ్య సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటులలో బాలయ్య కూడా ఒకరు కావడం విశేషం…అలాగే సినిమా కోసం ఎంతటి ఎఫర్ట్స్ అయినా పెట్టి ఆ సినిమా సక్సెస్ లో కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు…