Navadeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కి షాక్ తగిలింది. ఆయన బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. డ్రగ్స్ కేసుల్లో ప్రతిసారి నవదీప్ పేరు వినిపిస్తోంది. ఇతడికి డ్రగ్ ముఠాలతో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. తాజాగా మాదాపూర్ లో డ్రగ్స్ అమ్ముతూ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు పట్టుబట్టారు. ఈ కేసుతో నవదీప్ కి సంబంధం ఉందని అధికారులు వాదిస్తున్నారు. అరెస్ట్ చేస్తారనే భయంతో నవదీప్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాను ఎక్కడికీ పారిపోలేదు. హైదరాబాద్ లోనే ఉన్నానని నవదీప్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అలాగే డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదని తెలియజేశాడు. అయితే నవదీప్ ఇన్వాల్వ్మెంట్ ఉందని పోలీసులు గట్టిగా నమ్ముతున్నారు. నార్కోటిక్ అధికారులు నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇక మాదాపూర్ డ్రగ్ కేసులో బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు. నవదీప్ పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది.
గతంలో నవదీప్ డ్రగ్స్ కేసుల్లో ఉన్నప్పటికీ నేరం చేసినట్లు రుజువు కాలేదు. నా క్లయింట్ కి బెయిల్ జారీ చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. అయితే హైకోర్ట్ నవదీప్ కి బెయిల్ నిరాకరించింది. అతన్ని మాదాపూర్ డ్రగ్ కేసులో 41 ఏ గా నోటీసులు జారీ చేయాలని, అతడు విచారణకు హాజరయ్యేలా చూడాలని ఆదేశించింది. ఈ క్రమంలో నవదీప్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో అరెస్ట్ అయ్యే సూచనలు కలవు.
నటులుగా సక్సెస్ కానీ కొందరు ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారనే వాదన ఉంది. నవదీప్, తరుణ్, తనీష్ వంటి యువ నటుల పేర్లు పలుమార్లు డ్రగ్ కేసులో వినిపించాయి. జై చిత్రంలో నవదీప్ హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. దర్శకుడు తేజా తెరకెక్కించిన జై డిజాస్టర్. అయినప్పటికీ నవదీప్ కి హీరోగా అవకాశాలు వచ్చాయి. హీరోగా ఫేడ్ అవుట్ అయిన నవదీప్ విలన్, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.