Homeఎంటర్టైన్మెంట్Childhood Photo:100 కోట్ల స్టార్ హీరో.. సినిమాల్లోకి రాకముందటి ఫొటోలు వైరల్

Childhood Photo:100 కోట్ల స్టార్ హీరో.. సినిమాల్లోకి రాకముందటి ఫొటోలు వైరల్

Childhood Photo: టాలీవుడ్‌లో నాచురల్‌ స్టార్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే హీరో నాని. సక్సెస్, ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ సగటు ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాడు నాటి. రేడియో జాకీగా కెరియర్‌ ప్రారంబించిన నాని.. నేడు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అపజయాలు ఎదురైనా నిలదొక్కుకుని సిమాలు చేస్తున్నారు నాని. నేడు(ఫిబ్రవరి 24న) నాటి పుట్టిన రోజు సందర్భంగా ఆయన చిన్ననాటి ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నానీ అలియాస్‌ నవీన్‌బాబు..
నాచురల్‌ స్తార్‌ నాని పూర్తిపేరు నవీన్‌బాబు. ఫిబ్రవరి 24న ఆయన పుట్టిన రోజు. నాని స్వస్థలం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి గ్రామం. విశాకపట్నానికి చెందిన అంజనా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నానికి ఒక అక్క కూడా ఉన్నారు. ఆమె పేరు దీప్తి.

సహాయ దర్శకుడి నుంచి హీరోగా..
తొలినాళ్లలో నాని బాపు, శ్రీనువైట్ల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. అష్టా చమ్మా సినిమాతో అనుకోకుండా హీరోగా మారాడు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కింది. అష్టచమ్మ సినిమా. 2008లో మొదలైన ఆయన నటన ప్రయాణంలో ఇప్పటి వరకు 30కి పైగా సినిమాలు తీశాడు. తాజాగా దసరా, హాయ్‌ నాన్న చిత్రాలతో హిట్‌ కొట్టారు. త్వరలో సరిపోదా శనివారం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

కుటుంబానికి ప్రాధాన్యం..
సినిమా హీరోల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన నాని.. కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇస్తాడు. తన అక్క దీప్పి అంటే ఆయనకు ఎంతో ప్రేమ. షూటింగ్‌ నుంచి ఇంటికి రాగానే తన కుమారుడు, భార్యతో ఎక్కువ సమయం గడుపుతాడు. జీవితాంతం సినిమాలే చేస్తానని అంటున్నాడు నాని. అయితే బాలీవుడ్‌కు కూడా వెళ్లే ఆలోచన లేదని ఓ సందర్భంలో పేర్కొన్నాడు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular