Homeఎంటర్టైన్మెంట్Nani: తెలంగాణ యాసతో " దసరా " గా థియేటర్లలోకి రానున్న నాని...

Nani: తెలంగాణ యాసతో ” దసరా ” గా థియేటర్లలోకి రానున్న నాని…

Nani: నేచురల్​ స్టార్​ నాని నుంచి సినిమాలు వస్తున్నాయంటే చాలు ఏదో కొత్తదనం ఉండబోతుందని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. తన నటనతో పాటు విభిన్న పాత్రలు ఎంచుకుంటూ… ఎప్పటికప్పుడు అభిమానులను అకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు నాని. ఇటీవలే టక్​ జగదీశ్​తో ఓటీటీ వేదికగా పలకరించిన నాని మంచి టాక్​ను అందుకున్నారు. ఈ సినిమాతో ప్రేక్షకుల కుటుంబాల్లో ఒకరిగా కలిసిపోయారు నాని.

hero-nani-new-movie-titled-as-dasara

ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్స్​గా నటించారు. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరోవైపు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం లో కృతి శెట్టి ,సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, మురళి శర్మ , అభినవ్ గోమాతమ్ తదితరులు నటిస్తున్నారు

అయితే తాజాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై మరో సినిమాకు ఓకే చెప్పారు నాని.  సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ ఓదేల దర్శకత్వం వహిస్తున్నారు. ‘దసరా’ అనే టైటిల్​తో ఈ చిత్రం తెరకెక్కనుంది.  ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో నాని తెలంగాణ యాసలో అభిమానులు అలరించనుండగా… సంతోష్ నారయణ్ సంగీతం అందిస్తున్నారు.

నాని ఈ చిత్రంలో  తెలంగాణ యువకుడిగా కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని కూడా నియమించుకున్నట్టు సమాచారం. గ‌తంలో తను నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా కోసం రాయ‌ల‌సీమ యాస నేర్చుకున్న విషయం అందరికి తెలిసిందే. మరి ఈ  తెలంగాణ యువకుడిగా నాని ఎలా అలరిస్తారో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular