Hero Nandu: వామ్మో నందు పని చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు.

కెరీర్ సూపర్ డూపర్ గా నడుస్తున్నా.. అటు వ్యక్తిగత జీవితం కూడా బాగానే ఉంది. త్వరలో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందడానికి రెడీ అయ్యాడు. ఈయన భార్య ప్రముఖ సింగర్ గీతా మాధురి అని తెలిసిందే.

Written By: Swathi, Updated On : February 14, 2024 2:59 pm

Hero Nandu

Follow us on

Hero Nandu: నందు హీరోగా నటించకపోయినా మంచి క్రేజ్ ఉన్న నటుడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న ఈ నటుడు యాంకర్ గా రాణిస్తూ సినిమాల్లో అవకాశాలు పొందారు. అంతేకాదు ఐపీఎల్ ధనాధన్ క్రికెట్ టోర్నమెంట్ లో స్పోర్ట్స్ యాంకర్ గానూ తన సత్తా చాటాడు నందు. సుమార్ 25కు పైగా సినిమాల్లో నటించి టాలెంట్ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు ఈ యాక్టర్. ఇక ఇటీవల నందు నటించిన మ్యాన్షన్ 23, వధువు వెబ్ సిరీస్ లకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

కెరీర్ సూపర్ డూపర్ గా నడుస్తున్నా.. అటు వ్యక్తిగత జీవితం కూడా బాగానే ఉంది. త్వరలో మరోసారి తండ్రిగా ప్రమోషన్ పొందడానికి రెడీ అయ్యాడు. ఈయన భార్య ప్రముఖ సింగర్ గీతా మాధురి అని తెలిసిందే. ఈ దంపతులు ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వడానికి సిద్దమయ్యారు. ఇటీవల కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య గీతా మాధురి సీమంతం వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియాలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

మరోసారి తండ్రి కాబోతున్న సంతోషంలో కావచ్చు ఈ దంపతులు ఒక మంచి పని చేశారు. అయితే ఏం చేశారు అనుకుంటున్నారా. అన్నదానం చేసి ఏకంగా 800 మంది ఆకలి తీర్చాడు నందు. శ్రీ విద్యాపీఠంలో అన్నపూర్ణార్చన చేసిన నందు 800 మందికి ఆహారాన్ని అందించారు. తానే స్వయంగా ఫుడ్ ప్రిపేర్ చేశారు కూడా. అందరికీ వడ్డించింది కూడా నందునే.. అయితే అన్నదానం చేసిన తర్వాత ఆ పాత్రలను కూడా నందునే కడగడం గమనార్హం. యాక్టర్ అన్న పేరు పక్కన పెట్టి మరీ ఈ పనులు చేయడంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు.

అన్నదానానికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు నందు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. నందు మంచితనం, అలాగే అతని సింప్లిసిటీని చూసి పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2014లో గీతా మాధురిని ప్రేమ వివాహం చేసుకున్న నందుకు 2019లో దాక్షాయణి ప్రకృతి అనే కూతురు పుట్టింది. అయితే ప్రస్తుతం మరోసారి అమ్మానాన్నలు అవబోతున్నారు.