https://oktelugu.com/

Mahesh babu : తెలుగు సినిమాలను అవమానించే కోలీవుడ్ మూవీని మహేష్ బాబు ఎందుకు పొగిడినట్లు… ఇంట్రెస్టింగ్ స్టోరీ!

టాలీవుడ్ కి చెందిన ఓ బడా మూవీ విడుదల ఉందంటే తప్పులు వెతకడానికి, ట్రోల్ చేయడానికి తమిళ తంబీలు సిద్ధంగా ఉంటారు. ఏ విషయంలో అయినా మేమే గొప్ప అంటారు. అలాంటి కోలీవుడ్ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు కురిపించారు. ఇది ఆసక్తికర పరిణామం..

Written By:
  • S Reddy
  • , Updated On : July 31, 2024 / 11:13 AM IST
    Follow us on

    Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల హీరో ధనుష్ డైరెక్ట్ చేసి నటించిన ‘ రాయన్ ‘ సినిమా చూశారట. ఎక్స్ ఖాతా వేదికగా మహేష్ బాబు తన స్టైల్లో రివ్యూ ఇచ్చారు. కాగా ఆయన చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ముఖ్యంగా తమిళ తంబీల మనసులు టచ్ చేసింది. దీంతో మహేష్ బాబు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

    రాయన్ సినిమాలో ధనుష్ నటన, దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఎస్ జే సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ నటనతో మరోసారి మెప్పించారు .. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ప్రతి ఒక్కరు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది. మూవీ టీంకు శుభాకాంక్షలు అని మహేష్ బాబు తెలిపారు.

    ఒక పర భాషా హీరో అయినప్పటికీ అతని కష్టాన్ని, ట్యాలెంట్ ని గుర్తించి ఇలా అభినందించడం పట్ల ధనుష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా మహేష్ చేసిన ట్వీట్ షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. పలువురు కోలీవుడ్ క్రిటిక్స్ సైతం పోటీతత్వాన్ని ప్రేమించే ఇలాంటి గుణం చాలా మంది తమిళ హీరోల్లో లేదని దెప్పి పొడుస్తున్నారు. కమర్షియల్ సినిమా రాయన్ ని ప్రత్యేకంగా పొగడాల్సిన అవసరం లేకపోయినా .. ధనుష్ డైరెక్షన్ లోని తపనను చూసి తన వంతుగా శుభాకాంక్షలు చెప్పారని మహేష్ ని ఆకాశానికి ఎత్తుతున్నారు.

    అయితే తమిళులు ఇందుకు పూర్తిగా భిన్నం. ఇతర పరిశ్రమల సినిమాలను, హీరోలను ఆదరించరు. టాలీవుడ్ బడా స్టార్స్ కి కూడా తమిళనాడులో మార్కెట్ లేదు. కోలీవుడ్ టైర్ టు హీరోల చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. ఇక సోషల్ మీడియా వేదికగా మన భారీ బడ్జెట్ చిత్రాలను తమిళులు ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. రాజమౌళి గొప్పతనాన్ని తమిళులు అసలు ఒప్పుకోరు. కాపీ క్యాట్ అని ట్రోల్ చేస్తారు. అలాంటప్పుడు ఒక తమిళ హీరో సినిమాను మహేష్ బాబు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముందనే చర్చ మొదలైంది.

    చివరికి మహేష్ బాబును అనేక సందర్భాల్లో తమిళులు ట్రోల్ చేశారు. విజయ్ ఫ్యాన్స్ తరచుగా మహేష్ బాబుతో ఫ్యాన్ వార్ కి దిగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే తమిళ ఆడియన్స్ పైత్యం చాలానే ఉంది.

    అయితే ఇక్కడ మహేష్ బాబు మంచి మనసు గురించి చెప్పుకోవాలి. ఆయనకు ఒక గొప్ప అలవాటు ఉంది. విషయం ఉన్న సినిమాలను చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పొగిడేస్తారు. తన సోషల్ మీడియా పోస్ట్స్ ద్వారా ఫ్రీ పబ్లిసిటీ కల్పిస్తారు. ఇటీవల వచ్చిన మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు సినిమా చూసిన మహేష్ బాబు స్పందించారు. ఇంతలా ఎప్పుడు నవ్వుకోలేదు.. సినిమా చాలా బాగుంది అంటూ రివ్యూ ఇచ్చారు. అది ఎంత వైరల్ అయిందో తెలిసిందే. అదే విధంగా రాయన్ సినిమాను మహేష్ బాబు పరోక్షంగా ప్రమోట్ చేశాడు. ఇది రాయన్ తెలుగు కలెక్షన్స్ కి ప్లస్ కానుంది.