Hero-less Movie Hit: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా రావాలి అంటే దానికి ఒక హీరో కీలకమైన పాత్రను వహిస్తూ ఉంటాడు. ఇక అభిమానులు సైతం సినిమా చూడాలి అంటే ఆ సినిమాలో హీరో ఎవరు అని అడుగుతారు తప్ప సినిమా దర్శకుడి గురించి గానీ, ఇతర టెక్నీషియన్ల గురించి గానీ ఎవరూ పట్టించుకోరు. అయితే సినిమాలో హీరో నే లేకుండా వచ్చి సూపర్ సక్సెస్ లను సాధించిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. అందులో ‘మహావతార్ నరసింహ’ సినిమా ఒకటి…యానిమేషన్ సినిమాగా వచ్చినప్పటికి ఈ సినిమా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది.
Also Read: ‘కింగ్డమ్’ వసూళ్లు ఢమాల్..ఓవర్సీస్ కూడా ఎత్తిపోయిందిగా..3 రోజుల్లో వచ్చింది ఎంతంటే!
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భారీ కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది. మరి ఇప్పటివరకు ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక మీదట కూడా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాని ఏదో నార్మల్ గా తీసింది అయితే కాదట…శ్రీ మహావిష్ణువు అవతారాలను ఆధారంగా చేసుకొని ఇది ఒక యూనివర్స్ గా రూపొందించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ యూనివర్స్ నుంచి ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు…
పరుశురాం, రఘునందన్, ద్వారక దీష్,గోకులనంద, కల్కి-1, కల్కి-2 పేర్లతో తదుపరి చిత్రాలను ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ యూనివర్స్ లో ఉన్న అన్ని సినిమాలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ చేస్తూ వస్తామని మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాకి ఎక్కడలేని విశేషమైన ఆదరణ లభిస్తూ ఉండడం విశేషం…
ఇక చిన్న పిల్లలకైతే ఈ సినిమా విపరీతంగా నచ్చుతోంది. అలాగే ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాను చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు… ఇక ఇది చూసిన చాలా మంది దేవుళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి తెలియజేసే ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలని అలా వస్తేనే ఇప్పటి తరం వాళ్లకి దేవుళ్ల యొక్క గొప్పతనం తెలుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీ దర్శకుడు అయిన అశ్విన్ కుమార్ ఈ సినిమాని చాలా వ్యయ ప్రయాసలతో చాలా ఇబ్బందులను ఎదుర్కొని మరి తెరకెక్కించినట్టుగా తెలియజేశాడు.
Also Read: ఆరోజు నా చేత అతను లగేజ్ మోయించాడు..ఏడుపు వచ్చేసింది: రజనీకాంత్
2008వ సంవత్సరంలో వాళ్ళ స్నేహితులతో కలిసి కూర్చున్నప్పుడు వచ్చిన ఒక సంభాషణలో భాగంగా ఈ యూనివర్స్ ను క్రియేట్ చేయాలని అతను అనుకున్నారట. ఇక అప్పటి నుంచి అతను చేసిన ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతం అయింది. తన టీం మెంబర్స్ లేకపోతే తన ఒక్కడి వల్ల ఇది సాధ్యం అయ్యేది కాదని ఆయన చెబుతుండటం విశేషం…