Kingdom Weekend Collections: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కింగ్డమ్'(Kingdom Movie) ఇటీవలే భారీ అంచనాలు నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ నుండి వచ్చిన ప్రీమియర్ టాక్ లో కాస్త పాజిటివ్ రివ్యూస్ వచ్చేలా తమకు అనుకూలంగా ఉండేవాళ్ళని నిర్మాత నాగవంశీ ఏర్పాటు చేసుకున్నాడు కానీ, నిజాన్ని ఎక్కువ కాలం దాచలేరు అనే జీవిత సత్యాన్ని గుర్తించలేకపోయాడు. ఇండియా లో రెగ్యులర్ షోస్ మొదలు అవ్వగానే ఈ సినిమా సెకండ్ హాఫ్ బాలేదనే టాక్ వైల్డ్ ఫైర్ లాగా వ్యాప్తి చెందింది. దాని ప్రభావం సినిమా పై చాలా గట్టిగా పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎదో ఒకటి రెండు సిటీస్ లో తప్ప, మిగిలిన అన్ని చోట్ల డ్రాప్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
నార్త్ అమెరికా లో ప్రీమియర్స్ + మొదటి రోజు భారీ ఓపెనింగ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండవ రోజు మాత్రం కేవలం లక్షా 80 వేల అమెరికన్ గ్రాస్ డాలర్లకు మాత్రమే పరిమితమైంది. ఇక మూడవ రోజు అయితే లక్షా 50 వేల డాలర్లు రావడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి అడుగుపెట్టేందుకు ఏ మాత్రం ఉపయోగపడవు అని, మొదటి నుండి మంచి ట్రెండ్ తో కొనసాగుతున్న ఓవర్సీస్ లోనే పరిస్థితి ఇలా అయ్యిందంటే, ఇక రేపటి నుండి ఈ చిత్రం భవిష్యత్తు ఏమిటో మాకు అర్థం అయిపోతుందని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. మూడు రోజులకు కలిపి వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజు కేవలం 4 కోట్ల 34 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మూడు రోజులకు గాను 20 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా కలుపుకొని 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే ఇంకా ఈ చిత్రం 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలి. అంటే రేపటి నుండి సినిమా కచ్చితంగా నిలబడాలి. లేకపోతే విజయ్ దేవరకొండ కెరీర్ లో మరో ఫ్లాప్ నమోదు అయ్యినట్టే. అసలే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ మార్కెట్, ఈ సినిమా తో మరింత డ్యామేజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.