కుటుంబ సభ్యులతో పాటు కార్తికేయ సన్నిహితులు స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, ఇంతకీ కార్తికేయ చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరు అంటూ సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. ఇప్పటికి అయితే, ఆమె గురించి ఎవరికీ ఎలాంటి అప్ డేట్ లేదు.
మీడియా ప్రతినిధులు కార్తికేయను సంప్రదించినా తనకు కాబోయే సతీమణి గురించి డిటైల్స్ చెప్పడానికి ఆసక్తి చూపించలేదు. అయితే, ఆమె కార్తికేయ సన్నిహితుల కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. ఇది ప్రేమ వివాహం అని కూడా టాక్ ఉంది. పెద్దలు కూడా వారికి ప్రేమ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుని ఈ నిశ్చితార్థం వేడుక ఏర్పాటు చేశారట.
ఇక ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు యంగ్ హీరోలు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే, నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తున్నాడు.
అలాగే కేవలం హీరోగానే కాకుండా.. విలన్ పాత్రలను కూడా చేస్తున్నాడు. నాని ‘గ్యాంగ్‌లీడర్’లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం అజిత్ హీరోగా ‘వలిమై’లో కూడా కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు.