Hero Karthi: తిరుపతి లడ్డు ని జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తయారు చేసారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనపై ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రస్థాయిలో స్పందించాడు. ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ ఎంత మనోవేదనకు గురి అయ్యాడో నేటి ప్రెస్ మీట్ చూస్తే తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న కార్తీ హీరో గా నటించిన ‘సత్యం సుందరం’ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో సోషల్ మీడియా లో వచ్చే మీమ్స్ ని యాంకర్ చూపిస్తూ కాసేపు ఫన్నీ ఇంటరాక్షన్ హీరో కార్తీ తో జరిపింది.
ఈ ఇంటరాక్షన్ లో ‘లడ్డు కావాలా నాయనా’ అనే మీమ్ వస్తుంది. అప్పుడు యాంకర్ దాని గురించి మాట్లాడగా, కార్తీ దానికి సమాధానం చెప్తూ ‘లడ్డు మ్యాటర్ ఇప్పుడు చాలా సున్నితమైన అంశం..దాని గురించి మాట్లాడొద్దు’ అంటూ చాలా ఫన్నీ గా సమాధానం ఇస్తాడు. దీనికి పవన్ కళ్యాణ్ నేడు చాలా సీరియస్ గా కౌంటర్ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘నిన్న ఒక సినిమా ఫంక్షన్ లో లడ్డు గురించి మాట్లాడారు. దయచేసి అలా మాట్లాడొద్దు. ఇది సున్నితమైన అంశం కాదు, సినిమా వాళ్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను, సనాతన ధర్మం మీద జోక్స్ వద్దు’ అని కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో పెను దుమారం రేపింది. దీనికి కార్తీ రెస్పాన్స్ ఇస్తూ ‘పవన్ కళ్యాణ్ సార్, మీరంటే నాకు ఎంతో గౌరవం, ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. వేంకటేశ్వర స్వామి భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. కార్తీ మాట్లాడిన ఈ మాటలకు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం దీనికి చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు.
ఇందులో మీ తప్పేమి లేదు సార్, క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు, యాంకర్ ఇలాంటి ప్రశ్నలు అడగడం తప్పు, జనాలు ఈ సంఘటనపై చాలా ఫైర్ మీద ఉన్నారు, ఆ ఫ్లో లో మా పవన్ కళ్యాణ్ మీపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తున్నాము అంటూ ట్విట్టర్ లో కార్తీ ట్వీట్ కి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తాడో లేదో చూడాలి. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ కి కూడా చాలా బలమైన కౌంటర్ ఇచ్చాడు, మూడు రోజుల క్రితం ఆయన స్పందిస్తూ ఈ ఘటనని ఇంత పెద్దది చేయాల్సిన అవసరం ఏమి ఉందంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించాడు. దీనికి పవన్ కళ్యాణ్ మా మతానికి అన్యాయం జరిగితే స్పందించడం తప్పు ఎలా అవుతుంది అంటూ చాలా తీవ్ర స్థాయిలో ప్రకాష్ రాజ్ పై విరుచుకుపడ్డాడు.
Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.
— Karthi (@Karthi_Offl) September 24, 2024