HBD Kamal hasan: చిన్న పాత్రలతో సినీ కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత వరుసగా వచ్చి అవకాశాలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు కమల్ హాసన్. తన విశ్వరూపంతో దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న హీరో కమల్. హీరోగానే కాకుండా, డైరెక్టర్, రైటర్, సింగర్ ఇలా అన్నింటా ప్రతిభ కనబరుస్త.. నిజంగానే నవరసాలు పండించగల వ్యక్తి కమల్. ఈ రోజు నవంబరు 7న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకందాం.
కమల్ హాసన్ నవంబరు 7, 1954లో జన్మించారు. ఆరేళ్ల వయసులో సలాథూర్ కన్నమ్మ అనే సినిమా తర్వాత బాల నటుడిగా తన కెరీర్ మొదలు పెట్టారు. ఇలా బలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించిన కమల్. తర్వాత కొద్ది రోజుల పాటు చదువుపై దృష్టి కేంద్రీకరించారు. అనంతరం, 1971లో కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ‘అన్నై వెలంకని’, ‘కాశీ యాత్ర’ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
కాగా, తన కెరీర్లో వందలాది సినిమాలు తీశారు కమల్. ముఖ్యంగా ఆయన గురువు బాలచందర్‌తో తీసిన చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో కమల్‌ను స్టార్ హీరోగా గుర్తుండిపోయేలా చేశాయి. కమల్ హాసన్ తన అద్భుత నటనకు 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు 4 నేషనల్ అవార్డులను అందుకున్నారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషన్ వంటి ఎన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకున్నారు.
కమల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవ కార్యక్రమాలతోనూ తన మంచి మనసును చాటుకున్నారు. కమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కమల్ అభిమానులు పెద్ద ఎత్తున ఐ డొనేషన్ డ్రైవ్‌తో పాటు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు తన అమ్మకు గుర్తుగా రాజ్‌కమల్ నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్‌పై ఎన్నో విభిన్న కథలను తెరకెక్కించారు.
అలా వచ్చినవే విశ్వరూపం, ఉత్తమ విలన్. ఈ చిత్రాలు బాక్సీఫీసు వద్ద ఆకట్టుకోనప్పటికీ.. ఇప్పటికీ కల్ట్ ఫిల్మ్స్‌గా గుర్తింపు పొందాయి. ఇలా సినిమాల్లో తనదైన ముద్ర వేసిన కమల్ హాసన్.. రాజకీయాల్లోనూ అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. మక్కల్ నీధి మయం పేరుతో 2018లో పార్టీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా, ఆయన నటించిన విక్రమ్ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.