సినిమా ఇండస్ట్రీలో ఆయనది పెద్ద కుటుంబం. పైగా ఆయన స్టార్ హీరో. కానీ నేను స్టార్ ను అనే బిల్డప్ లు ఆయన దగ్గర లేవు. పైగా ఆ స్టార్ డమ్ డాంబికాలు కూడా ఎన్నడూ ఆయన చూపించలేదు. ముఖ్యంగా ఆయన సినిమాల విషయంలో పెద్దగా పట్టించుకోడు. ఫలానా నటులనే తీసుకోండి, ఆ హీరోయిన్ నే తీసుకోండి లాంటి రికమెండేషన్లు చేయడం ఆయనకు అలవాటు లేదు.

కానీ, ఈ మధ్య ఆ స్టార్ హీరోకి కొత్త అలవాటు అబ్బింది. ముఖ్యంగా ఓ హీరోయిన్ విషయంలో. ఆ హీరోయిన్ అంటే ఆయనకు ఎక్కడో ప్రత్యేక అభిమానం కలిగింది. అందుకే, ఆయన ఆ హీరోయిన్ పై శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆ హీరోయిన్ తో గతంలో ఓ సినిమా చేశాడు ఆయన. అప్పుడు ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఏమైందో ఏమో.. కరోనా అనంతరం ఆ హీరోయిన్ కి ఆయన బాగా దగ్గర అయ్యారు.
అప్పటి నుంచీ ఆ హీరోయిన్ తో చనువుగా ఉంటున్నారు. పైగా ఆ హీరోయిన్ ని ఇంటికి తీసుకెళ్లి, తన ఫ్యామిలీ మెంబర్స్ తో స్నేహం చేయించేంత స్వేచ్ఛను ఆ హీరోయిన్ కి ఇచ్చాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ హీరోయిన్ పై ఆయన చూపిస్తున్న అనుబంధాన్ని చూసి షాక్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఆయనకు ఎదురు చెప్పలేరు.
సరే.. ఇదేదో ఫ్యామిలీకే పరిమితం అయితే బాగుండేది. కానీ, ఆ హీరోయిన్ కి సినిమా ఛాన్స్ లు ఇప్పించడానికి ఆయన కాస్త గట్టిగానే పట్టు బడుతున్నాడు. తాను చేస్తున్న కొత్త సినిమాలో ఎట్టిపరిస్థితుల్లో ఆ హీరోయిన్ అవకాశం ఇవ్వాల్సిందే అంటూ నిర్మాతకి కండిషన్ పెట్టాడు. పోనీలే హీరోగారు ముచ్చట పడుతున్నారు కాబట్టి.. హీరోయిన్ గా ఛాన్స్ ఇద్దాంలే అని ఆ నిర్మాత ఛాన్స్ ఇచ్చాడు.
అయితే, ఆ తర్వాత ఆ నిర్మాతతో పోట్లాడి మరీ ఆ హీరోయిన్ భారీ పారితోషికం ఇప్పించాడు ఆయన. ఆ హీరోయిన్ కి రెట్టింపు పారితోషికం ఇవ్వడం ఇష్టం లేని నిర్మాత, హీరో రికమెండేషన్ ను కాదు అనలేక, ఇష్టం లేకపోయినా డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఆ నిర్మాత ఆ హీరోయిన్ పై గుర్రుగానే ఉన్నాడట. ఎలాగైనా ఆ హీరోయిన్ కి ఈ హీరోగారికి మధ్య గ్యాప్ పుట్టించడానికి సదరు నిర్మాత తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ మరోపక్క ఆ హీరో గారు, హీరోయిన్ గారికి తదితర సౌకర్యాలన్నీ దగ్గరుండి చూసుకుంటూ.. ఆమె సేవలో సానిహిత్యంలో చక్కగా సేద తీరుతున్నాడు. మధ్యలో అదనపు ఖర్చులు భరించలేక నిర్మాత తిప్పలు పడాల్సి వస్తోంది.