https://oktelugu.com/

ముంబైకి పారిపోతున్న హీరో, హీరోయిన్

హీరో రాంచరణ్ ఆయన భార్య ఉపాసన సినిమాల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. ఎందుకంటే ఉపాసన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్.. అదేకాకుండా సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక రాంచరణ్ సైతం ‘ఆర్ఆర్ఆర్’ సహా కొత్త సినిమాల షూటింగ్ ల కోసం ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి తరచూ వెళుతూ హోటల్స్ లో ఇబ్బంది పడకుండా తాజాగా ముంబైలోనే ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. ఇప్పుడు రాంచరణ్-ఉపాసన బాటలోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : July 8, 2021 / 12:03 PM IST
    Follow us on

    హీరో రాంచరణ్ ఆయన భార్య ఉపాసన సినిమాల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు. ఎందుకంటే ఉపాసన అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్.. అదేకాకుండా సొంతంగా వ్యాపారాలు కూడా నిర్వహిస్తుంటారు. ఇక రాంచరణ్ సైతం ‘ఆర్ఆర్ఆర్’ సహా కొత్త సినిమాల షూటింగ్ ల కోసం ముంబైకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి తరచూ వెళుతూ హోటల్స్ లో ఇబ్బంది పడకుండా తాజాగా ముంబైలోనే ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వారి రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు.

    ఇప్పుడు రాంచరణ్-ఉపాసన బాటలోనే నాగచైతన్య-సమంత జోడి ఆలోచిస్తోందట.. ఎందుకంటే సమంత ఈ మధ్య ప్యాన్ ఇండియా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. దానికోసం ముంబైలోనే ఉండాల్సి వస్తోంది. అందుకే ఈ జంట కూడా ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది.

    సమంత వ్యాపారాలు నిర్వహిస్తోంది. ‘సాకీ’ పేరుతో ఆన్ లైన్ ఫ్యాషన్ రంగంలో ఉంది. త్వరలోనే నగల వ్యాపారంలోకి దిగుతోంది. ముంబైలో ఈ బిజినెస్ లు మొదలు పెట్టాలని సమంత భావిస్తున్నట్టు సమాచారం. ఇక నాగచైతన్య సైతం త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో చైతన్య కీలక పాత్ర పోషిస్తున్నాడట..

    సమంత ‘ఫ్యామిలీ మ్యాన్2’ హిట్ తో వరుసగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట.. దీంతో అటు సినిమాలు, ఇటు బిజినెస్ లలో సక్సెస్ సాధించేందుకు ఈ జంట ముంబైలో ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తోందట.. ఈ మేరకు సమంత ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది.