https://oktelugu.com/

Hero Nani : నానికి తెలుగు లో ఫేవరెట్ హీరోలు ఎవరో తెలుసా..? వాళ్లే ఎందుకు ఇష్టమంటే..?

ఇక ఇప్పటికే సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే బలగం వేణు డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్లతో పాటుగా మరి కొంతమంది కొత్త డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సన్నాహాలను చేస్తున్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : April 6, 2024 / 10:32 PM IST

    Hero Nani

    Follow us on

    Hero Nani : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నా నటులలో నాని ఒకరు. ఈయన ఎటువంటి వారసత్వం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అతి తక్కువ సినిమాలతోనే ‘నాచురల్ స్టార్’ గా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా, మన పక్కింట్లో ఉండే కుర్రాడు ఎలాగైతే మాట్లాడుతాడో అలాంటి సహజమైన నటనతో ప్రతి ఇంట్లో నాని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా ప్రాజెక్టులను చేస్తున్నాడు. ఇక అందులో భాగంగా దసరా సినిమాతో పాన్ ఇండియా లో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న నాని..

    ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే నానికి ఫేవరెట్ హీరోలు ఎవరు అనే విషయం మీద సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే నానికి ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సొంతంగా తన కాళ్ళ మీద ఎదిగి నిలబడి చూపించిన చిరంజీవి అంటే ఇష్టమట. అలాగే ఆయన ఇన్స్పిరేషన్ తోనే నాని సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టుగా చెప్పాడు. ఇక రవితేజ అంటే కూడా తనకు చాలా ఇష్టమట. రవితేజ ఎనర్జీ చాలా ఎక్స్ ట్రా ఆర్డినరీ గా ఉంటుందని అందువల్లే రవితేజ అంటే అతనికి చాలా అభిమానమని ఆయన తెలియజేయడం విశేషం..

    చిరంజీవి నాని వీళ్ళు ముగ్గురు కూడా ఇండస్ట్రీ లో ఎవ్వరూ సపోర్ట్ లేకుండా వచ్చి సోలోగా ఎదిగి చూపించారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు అంటే ప్రేక్షకులందరికీ అమితమైన రెస్పెక్ట్ అయితే ఉంటుంది. ఇక ఇలాంటి క్రమం లోనే ప్రస్తుతం వీళ్లు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక నాని అయితే వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.

    ఇక ఇప్పటికే సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. అలాగే బలగం వేణు డైరెక్షన్ లో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్లతో పాటుగా మరి కొంతమంది కొత్త డైరెక్టర్లతో కూడా సినిమాలు చేయడానికి సన్నాహాలను చేస్తున్నాడు…