Dhanush Son: పాన్ ఇండియా లెవెల్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న వారిలో ఒకరు ధనుష్(Dhanush K Raja). పేరుకే తమిళ హీరో, కానీ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో నటిస్తూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. రీసెంట్ గానే ఈయన టాలీవుడ్ లో ‘కుబేర’ చిత్రం తో భారీ హిట్ ని అందుకున్నాడు, అదే విధంగా బాలీవుడ్ లో ‘తేరే ఇష్క్ మెయిన్’ సినిమా తో మరో సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ధనుష్ గురించి చాలానే ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈయన హాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. త్వరలోనే అక్కడ హీరో గా ఒక పూర్తి స్థాయి చిత్రం చేయబోతున్నాడు. ఇలా అన్ని భాషల్లో ప్రత్యేకంగా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ ని అందుకోవడం ధనుష్ కి తప్ప మరొకరికి సాధ్యం కాదు అనుకుంట.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ధనుష్ తన ఇద్దరు కొడుకులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ధనుఇష్ పెద్ద కొడుకు పేరు యాత్ర రాజా, చిన్న కొడుకు పేరు లింగ రాజా. తిరుమల వీడియో లో యాత్ర రాజా ని చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అతను అచ్చు గుద్దినట్టు ధనుష్ కి జిరాక్స్ కాపీ లాగా ఉన్నాడు కాబట్టి. అంతే కాదు ధనుష్ కంటే ఎంతో తెల్లగా కూడా ఉన్నాడు. ధనుష్ గొప్ప అందగాడు కాకపోవచ్చు కానీ, అతని ముఖం లో ఎదో తెలియని స్పార్క్ ఉంటుంది. యాత్ర రాజా లో ఆ స్పార్క్ ఉంది, అందం కూడా ఉంది. ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే కచ్చితంగా సక్సెస్ సాధిస్తాడని బలమైన నమ్మకం తో ఉన్నారు ధనుష్ ఫ్యాన్స్.
ఇకపోతే ధనుష్ ఐశ్వర్య తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితమే వీళ్లిద్దరు విడిపోయారు. అప్పటి నుండి ధనుష్ పై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. సీనియర్ హీరోయిన్ మీనా ని పెళ్లి చేసుకోబోతున్నాడని కొన్ని రోజులు, అదే విధంగా మృణాల్ ఠాకూర్ ని పెళ్లి చేసుకుబోతున్నాడని ప్రస్తుతం రూమర్స్ నడుస్తున్నాయి. వీటిల్లో మీనా తో డేటింగ్ చేస్తున్నాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదు కానీ, మృణాల్ ఠాకూర్ తో మాత్రం డేటింగ్ చేస్తుండడం మాత్రం నిజమేనని అంటున్నారు. అందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయి. వీళ్లిద్దరు హోటల్ రూమ్ లో గడిపిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి . ఫిబ్రవరి నెలలో వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ధనుష్ కొడుకు వీడియో ని క్రింద అందిస్తున్నాము చూడండి.
