Hero Arjun: లైంగిక వేధింపుల కేసులో హీరో అర్జున్​కు క్లీన్​చిట్​

Hero Arjun: ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్​ హీరో అర్జున్​ సర్జాకు క్లీన్​ చిట్​ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో అర్జున్​పై మోపిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్​కు నివేదిక సమర్పించారు. కాగా, మూడేళ్ల క్రితం శ్రుతి హరిహరన్ అనే హీరోయిన్​.. అర్జున్​పై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్​లో రిహార్సల్స్​ సాకుతో […]

Written By: Raghava Rao Gara, Updated On : December 1, 2021 2:52 pm
Follow us on

Hero Arjun: ఇటీవల లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న స్టార్​ హీరో అర్జున్​ సర్జాకు క్లీన్​ చిట్​ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడంతో అర్జున్​పై మోపిన అభియోగాల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలింది. ఇదే విషయాన్ని బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్​కు నివేదిక సమర్పించారు. కాగా, మూడేళ్ల క్రితం శ్రుతి హరిహరన్ అనే హీరోయిన్​.. అర్జున్​పై మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సినిమా షూటింగ్​లో రిహార్సల్స్​ సాకుతో అర్జున్​ తనను కౌగిలించుకున్నాడని.. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శ్రుతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లే సెన్​షేషన్​ క్రియేట్  చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీససులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం.. అర్జున్​కు క్లీన్​షీట్​ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందువల్లే.. అతనిపై ఉన్న అభియోగాలను కొట్టిపడేసినట్లు తమ నివేదికలో పోలీసులు రూపొందించారు.

నాలుగేళ్ల క్రితం భారత్​లో తనుశ్రీ దత్త మొదలుపెట్టిన మీటూ ఉద్యమంలో భాగంగా అనేక మంది మహిళలు సెలబ్రిటీలపై అభియోగాలు  మోపారు. అందులో భాగంగా పలువురు అరెస్టు కూడా అయ్యారు. అయితే, మరికొంత మంది ఈ ఉద్యమాన్ని వ్యక్తిగతం ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే అర్జున్​పైనా కేసు నమోదైంది.