https://oktelugu.com/

Hero Akhil: హీరో అఖిల్ కి సర్జరీ… కారణం ఏంటంటే?

అఖిల్ సర్జరీకి సిద్ధం అవుతున్నాడట. అందం కోసం సెలెబ్రిటీలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలాగే అఖిల్ కూడా స్వల్ప సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్నాడట. అఖిల్ ముక్కుకి సర్జరీ జరగనుందని ఓ పుకారు గట్టిగా చక్కర్లు కొడుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : October 14, 2023 / 05:00 PM IST

    Hero Akhil

    Follow us on

    Hero Akhil: హీరో అఖిల్ టైం బాగోలేదు. అపారమైన ఫ్యాన్ బేస్ ఉన్నా బాక్సాఫీస్ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. ఆయన డెబ్యూ మూవీ అఖిల్. దర్శకుడు వివి వినాయక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. యాక్షన్ సినిమాలు వద్దని రొమాంటిక్ లవ్ జానర్స్ ట్రై చేశాడు. అలా చేసిన మిస్టర్ మజ్ను, హలో చిత్రాలు కూడా నిరాశపరిచాయి. నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో మొదటి హిట్ కొట్టాడు. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

    వెంటనే మళ్ళీ యాక్షన్ హీరో అవతారం ఎత్తాడు. సుందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చేశాడు. ఈ చిత్రం అఖిల్ కి ఉన్న కొద్దిపాటి ఇమేజ్ కూడా డామేజ్ చేసింది. కనీస వసూళ్లు రాబట్టడంలో ఫెయిల్ అయిన ఏజెంట్ భారీ నష్టాలు మిగిల్చింది. ఏజెంట్ ఫలితంతో నిరాశపడిన అఖిల్ నెక్స్ట్ ఎలాంటి చిత్రంలో చేయాలో ఆలోచిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

    అఖిల్ సర్జరీకి సిద్ధం అవుతున్నాడట. అందం కోసం సెలెబ్రిటీలు కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంటారు. అలాగే అఖిల్ కూడా స్వల్ప సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్నాడట. అఖిల్ ముక్కుకి సర్జరీ జరగనుందని ఓ పుకారు గట్టిగా చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ… ప్రముఖంగా ప్రచారం అవుతుంది. బాలీవుడ్ హీరోలకు ఈ మాత్రం తగ్గని గ్లామర్ ఉన్న అఖిల్ కి సర్జరీలు అవసరం లేదని ఫ్యాన్స్ అంటున్నారు.

    నెక్స్ట్ కొత్త దర్శకుడితో అఖిల్ మూవీ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతుంది. సాహో, రాధే శ్యామ్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్ కుమార్ తో మూవీకి సైన్ చేశాడట. ఈ చిత్ర టైటిల్ ధీర అంటున్నారు. అలాగే విరూపాక్ష 2లో అఖిల్ నటించే అవకాశం కలదంటూ టాలీవుడ్ టాక్. ఒక్క హిట్ పడితే అఖిల్ హీరోగా సెట్ కావడం ఖాయం.