Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న ‘హరిహర వీరమల్లు’ నుంచి ఆయన అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ‘పవర్ గ్లాన్స్’ సిద్ధం చేసినట్లు తెలిసింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాను కరోనాకు ముందే మొదలుపెట్టారు. మధ్యలో కరోనాతో కొన్ని రోజులు.. ‘భీమ్లానాయక్’ కోసం సగం షూటింగ్ అయ్యాక ఆపారు. అనంతరం గ్రాఫిక్స్ వర్క్స్, సెట్స్ వేసి తాజాగా సినిమాను రూపొందిస్తున్నారు.

కాగా సెప్టెంబరు 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘హరిహర వీరమల్లు’ నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు చిత్రం యూనిట్ రెడీ అయ్యింది. సెప్టెంబర్ 2న సాయంత్రం 5.45 గంటలకు ఈ చిత్రం నుంచి ‘పవర్ గ్లాన్స్’ విడుదల కానుంది.
హరిహర వీరమల్లు నుంచి ఇది వరకు ఒక్క టీజర్ మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఇందులో ఒక యోధుడిగా నటిస్తున్న పవన్ నుంచి ఎలాంటి ట్రీట్ ఇస్తారన్నది ఆసక్తి రేపుతోంది.దీన్ని మరింత పెంచుతూ పవన్ కళ్యాణ్ ఒక ఎర్రటి వస్త్రం చాటు నుంచి చూస్తున్న స్టిల్ ను వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు. దీంతో సెప్టెంబర్ 2 పవన్ పుట్టిన సందర్భంగా ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా నిధి అగర్వాల్ హీరోయిన్గా కనిపించనుంది. ఎఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో లేదా సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
https://www.youtube.com/watch?v=6AoeUJSSVKQ
