https://oktelugu.com/

Prakash Raj: ప్రకాష్ రాజ్ తనకంటే పెద్ద నటులకు తండ్రిగా నటించిన సినిమాలు ఇవే…

ఆయన పోషించని పాత్ర లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, తండ్రిగా ఇలా చాలా పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే ప్రకాష్ రాజ్ ఎన్నో పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 29, 2024 2:16 pm
    Prakash Raj played the father to older actors
    Follow us on

    Prakash Raj: సినిమా ఇండస్ట్రీ లో నటులుగా రాణించాలి అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇండస్ట్రీ లో ఒక రోజులోనే చాలామంది నటులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాళ్ళను ఎదుర్కోవాలంటే తమకంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంటేనే, తప్ప లేకపోతే ఇక్కడ నిలబడడం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది… ఇక చాలా పోటీ మధ్యలో కూడా ప్రకాష్ రాజ్ లాంటి ఒక నటుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి, దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తన స్టామినా ఏంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ఇక ఆయన పోషించని పాత్ర లేదు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, తండ్రిగా ఇలా చాలా పాత్రల్లో నటించి మెప్పించాడు. అయితే ప్రకాష్ రాజ్ ఎన్నో పాత్రల్లో నటించి విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన తన కెరీయర్ లో తనకంటే పెద్ద వాళ్ళైన నటులకి కూడా తండ్రిగా నటించి మెప్పించాడు. వాళ్ళెవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    గుణశేఖర్ డైరెక్షన్ లో చిరంజీవి(Chiranjeevi) హీరోగా వచ్చిన మృగరాజు సినిమాలో చిరంజీవికి ఫాదర్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ప్రకాష్ రాజ్ నటన విపరీతంగా నచ్చుతుంది…ఇక అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి ఫాదర్ గా నటించాడు. నిజానికి వెంకటేష్ కంటే ప్రకాష్ రాజ్ చిన్నవాడు. ప్రస్తుతం వెంకటేష్ ఏజ్ 65 సంవత్సరాలు అయితే ప్రకాశ్ రాజ్ ఏజ్ 59 సంవత్సరాలు. అంటే ప్రకాష్ రాజ్ వెంకటేష్ కంటే దాదాపు 6 సంవత్సరాలు చిన్నవాడు. అయిన కూడా వెంకటేష్ కి ఫాదర్ గా నటించడమే కాకుండా ఆ పాత్ర కి జీవం పోశాడు. ఇక అలాగే ఆ సినిమా విజయం లో కూడా కీలక పాత్ర వహించాడు…

    ఇక ప్రకాష్ రాజ్ తనకంటే ఏజ్ లో పెద్ద వాళ్లకి కూడా నాన్న గా నటించి మెప్పించాడు…అందుకే ఒక నటుడి దగ్గర దమ్ము ఉంటే ఎలాంటి పాత్రనైనా సునాయాసంగా పోషించవచ్చు అని చెప్పడానికి ప్రకాష్ రాజ్ ను ఒక ఉదాహరణగా చెప్పవచ్చు…