10 Telugu Movies Remade And Dubbed: సినిమా రంగంలో భాషకు ఈమధ్య ఎలాంటి సరిహద్దులు ఉండవు. సినిమాలో కంటెంట్ ఉంటే మాత్రం సినిమాను భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. తెలుగులో వచ్చిన సినిమాలు ఇతర భాషల్లోకి, ఇతర భాషల్లోని సినిమాలు తెలుగులోకి డబ్ అవుతుంటాయి. కొన్నిసార్లు రీమేక్ లు అవుతుంటాయి. అయితే డబ్ అయినా కూడా రీమేక్ అయిన 10 సినిమాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
1. కాటమరాయుడు:
తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కాటమరాయుడు సినిమా ఈకోవలోకి వస్తుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వీరం’ సినిమా నిజానికి తెలుగులోకి ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ హీరోగా ‘కాటమరాయుడు’గా తెలుగులో అదే సినిమా స్టోరీతో వచ్చాడు.
2. గద్దలకొండ గణేష్:
తెలుగులో వరుణ్ తేజ్ కు క్రేజీ ఫాలోయింగ్ తెచ్చిన ‘గద్దలకొండ గణేష్’ కూడా తెలుగులో అప్పటికే డబ్ అయినా రీమేక్ చేశారు. తమిళంలో హిట్ అయిన ‘జిగర్తాండ’ ను తెలుగులో ‘చిక్కడు దొరకడు’ పేరుతో డబ్ చేసినా.. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో రీమేక్ చేశారు.
3. లీలామహల్ సెంటర్:
ఆర్యన్ రాజేష్, సదాలు హీరో, హీరోయిన్లుగా చేసిన ‘లీలామహల్ సెంటర్’ సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. తమిళంలో వచ్చిన ‘అమర్కలం’కి ఇది రీమేక్ కాగా.. దీని ఒరిజినల్ సినిమాను తెలుగులో ‘అద్భుతం’ పేరుతొ డబ్ చేశారు.
4. నీజతగా నేనుండాలి:
హిందీలో పాటల ద్వారా ఫుల్ పాపులర్ అయిన ‘ఆషికీ’ సినిమాను తెలుగులో ‘నీజతగా నేనుండాలి’ పేరుతో రీమేక్ చేశారు. కానీ అంతకుముందే తెలుగులోకి ఈ సినిమా డబ్ అయింది.
5. గాడ్ ఫాదర్:
మలయాళ సినిమా ‘లూసీఫర్’ అక్కడ భారీ హిట్ అయింది. మోహన్ లాల్ కెరీర్ లో డీసెంట్, మెగా హిట్ గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో ఇప్పుడు మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. కాగా దీనిని ‘లూసీఫర్’ పేరుతో తెలుగులో ఆల్రెడీ డబ్ చేశారు.
6. భోళాశంకర్:
తమిళ హీరో అజిత్ తీసిన ‘వేదాలం’ అక్కడ భారీ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగులో ‘ఆవేశం’ పేరుతో డబ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 2.
మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు.
7. డియర్ మేఘ:
కన్నడలో భారీ హిట్ అయిన ‘దియా’ సినిమాను తెలుగులోనూ అదే పేరుతో డబ్ చేశారు. కానీ ఇదే సినిమాను మేఘా ఆకాశ్ హీరోయిన్ గా ‘డియర్ మేఘ’ పేరుతో రీమేక్ చేశారు.
8. తేరి రీమేక్:
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘తేరి’ తమిలనాట భారీ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో డబ్ చేశారు. కాగా ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నాడు.
9. ఎన్నై అరిందాల్ రీమేక్:
అజిత్ హీరోగా చేసిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా భారీ హిట్ అయింది. ఈ సినిమాను తెలుగులో ఇప్పటికే ‘ఎంతవాడుగాని’ పేరుతో డబ్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడట.
10. మానాడు రీమేక్:
తమిళంలో ఈ మధ్యన విడుదలై భారీ హిట్ అయిన సినిమా ‘మానాడు’. ఈ సినిమా ఇప్పటికే ‘లూప్’ పేరుతో డబ్ కాగా.. దీనిని తెలుగులో రీమేక్ చేయడానికి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.