https://oktelugu.com/

Saripodhaa Sanivaaram: విపరీతమైన వర్షాలు..ఆగిపోయిన ‘సరిపోదా శనివారం’ షోస్..ఎంత గ్రాస్ నష్టమో తెలిస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!

వర్షం ఆగకుండా పడుతూనే ఉండడం వల్ల అక్కడ కూడా గ్రాస్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఈ సినిమాకి భారీ గ్రాస్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు రెండు రోజులకు కలిపి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 12:54 pm
    Saripodhaa Sanivaaram(1)

    Saripodhaa Sanivaaram(1)

    Follow us on

    Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘దసరా’ తర్వాత నాని కి ఇది వరుసగా మూడవ హిట్ అని ట్రేడ్ పండితులు కూడా అన్నారు. ఓపెనింగ్స్ కూడా అదిరిపోయాయి, రెండవ రోజు వచ్చిన వసూళ్లు కూడా ట్రేడ్ పండితులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ సినిమా వసూళ్లకు వరుణ దేవుడు అడ్డు తగులుతున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న రాత్రి నుండి ఆంధ్ర ప్రదేశ్ లో విపరీతంగా వర్షాలు పడుతుండడం వల్ల మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయ్యాయి. అంతే కాకుండా ఈ చిత్రానికి హైదరాబాద్ లో మూడవ రోజుకు గానూ అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.

    కానీ వర్షం ఆగకుండా పడుతూనే ఉండడం వల్ల అక్కడ కూడా గ్రాస్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే ఈ సినిమాకి భారీ గ్రాస్ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు రెండు రోజులకు కలిపి 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మూడవ రోజు రెండవ రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా, తీవ్రమైన వర్షాల కారణంగా ఇప్పుడు రెండవ రోజు కంటే తక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఓవరాల్ గా లాంగ్ వీకెండ్ కలిపి ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏర్పడిన ఈ ప్రతికూల పరిస్థితుల కారణంగా ఒక నాలుగు కోట్ల రూపాయిలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి అన్ని ప్రాంతాలకు కలిపి 42 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం కష్టమేమో అని చాలా మంది అనుకున్నారు కానీ, ఇప్పుడు అతి తేలికగా ఆ మార్కుని అందుకుంటుంది అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కూడా వచ్చాయి.

    కానీ వర్షాకాలం వల్ల ఫుల్ రన్ ఒక రెండు కోట్ల రూపాయిలు బ్రేక్ ఈవెన్ కంటే తక్కువ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి అద్భుతమైన వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజు+ రెండవ రోజుకి కలిపి 8 లక్షల 60 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. నేటితో ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ మార్కుని దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో కేవలం నార్త్ అమెరికా మరియు కెనడా నుండి రెండు మిల్లియన్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.