https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ..కోర్టు తీర్పు పై అభిమానుల్లో ఉత్కంఠ!

డిసెంబర్ నాల్గవ తేదీన పుష్ప ప్రీమియర్ షో రోజున సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసిలాట దుర్ఘటన లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద బయటకి వచ్చిన కి వచ్చిన సంగతి తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : December 30, 2024 / 11:15 AM IST

    Allu Arjun

    Follow us on

    Allu Arjun : డిసెంబర్ నాల్గవ తేదీన పుష్ప ప్రీమియర్ షో రోజున సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసిలాట దుర్ఘటన లో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి, బెయిల్ మీద బయటకి వచ్చిన కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన బయటకి వచ్చిన తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. ఈ దుర్ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతానికి ఆ కుర్రాడి ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ గానే ఉంది. త్వరలోనే అతను పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై నేడు నాంపల్లి కోర్టు లో విచారణ జరగనుంది. ఈ పిటీషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్ రిమాండ్ గడువు పూర్తి అవ్వడంతో, జనవరి 10 వ తారీఖు వరకు అతని రిమాండ్ ని పొడిగించాలని పోలీసులు వేసిన పిటీషన్ పై కూడా నేడు విచారణ జరగనుంది.

    ఈ విచారణకు కోర్టు ఏమని తీర్పు ఇవ్వబోతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు మొత్తం కలిసి సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన సంగతి తెలిసిందే. తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని ఒక్క రోజు అరెస్ట్ చేస్తే సినీ ఇండస్ట్రీ మొత్తం అతని ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించింది, కానీ హాస్పిటల్ లో చావు బ్రతుకుల మధ్య ఉన్న శ్రీ తేజ్ ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు, ఒక నిండు ప్రాణం పోవడానికి సినిమా ఇండస్ట్రీ కారణమైంది, దీంతో ఇక నుండి నేను ముఖ్యమంత్రి గా ఉన్నన్ని రోజులు తెలంగాణాలో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ ఉండవని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి కఠినంగా చెప్పాడు.

    దీంతో ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏర్పాటు చేయడానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా దిల్ రాజు ప్రయత్నం చేసారు. హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ లెవెల్ లో సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై చర్చలు జరిపినట్టు చెప్పారు. అల్లు అర్జున్ కేసు విషయం పై కానీ, బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ గురించి కానీ ఎలాంటి చర్చ రాలేదట. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్ నాకు శత్రువేమి కాదు, చిన్నప్పటి నుండి ఆయన నాకు తెలుసు, వాళ్ళు ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఏదైనా చట్ట పరంగా జరగాలి అనేదే నా అభిలాష అని చెప్పుకొచ్చాడు. అంతే పరోక్షంగా అల్లు అర్జున్ ని ఈ కేసు విషయం లో వదిలేదే లేదు అని సీఎం రేవంత్ అన్నట్టు అర్థం అవుతుంది. మరి చివరికి ఈ కేసు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.