Khiladi: దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్నాడు. కాగా ఈ ఖిలాడీ మూవీని దర్శకుడు రమేష్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని ఈ సినిమా నిర్మాత నిర్మాత కోనేరు సత్యనారాయణ తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందుకే, సినిమా రిలీజ్ కు ముందే తమ దర్శకుడు రమేష్ వర్మకు కోనేరు సత్యనారాయణ ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్టుగా ఇచ్చారు.

ముందు మాట్లాడుకున్న రెమ్యునరేషన్ ను ఇవ్వడానికి కూడా ఆలోచించే నిర్మాతలు ఉన్న ఈ కాలంలో సినిమా హిట్ కాకముందే.. గొప్పగా సినిమాను తీశాడు అని డైరెక్టర్ కి ఇలా ముందే ఖరీదైన రేంజ్ రోవర్ కారును గిఫ్టుగా ఇవ్వడం గొప్ప విషయమే. పైగా ఈ కారు ధర విలువ దాదాపు రూ.కోటి 15 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.

కాగా ఖిలాడీ మూవీ ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ కు రెడీగా ఉన్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. అన్నట్టు ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడని, పైగా తండ్రీకొడుకులుగా కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమా కథ ఎక్కువగా ముసలి రవితేజ పాత్ర చుట్టే తిరుగుతుందట.
కాగా రవితేజ ముసలాడు అయినప్పటికీ ఒక పాతికేళ్ల అమ్మాయితో ప్రేమలో పడతాడని, అక్కడి నుంచి కథ ఎన్ని మలుపులు తిరిగింది అని తెలుస్తోంది. మరి ఈ ముసలాడి కథకు ఎలాంటి ముగింపు ఇచ్చారు అనేది చూడాలి. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ ‘ఖిలాడి’ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది