దీనికి తోడు మహేష్ కూడా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో తన డల్ ఫోటోలే ఎక్కువగా షేర్ చేస్తున్నారు తప్ప.. తనలోని గ్రేస్ పెంచే ఫోటోలను మాత్రం మహేష్ పోస్ట్ చేయడం లేదని నెటిజన్లు కూడా అసంతృప్తి వ్యక్తపరుస్తూ వస్తున్నారు. ఐతే తాజాగా మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ అంటూ ఒక స్పెషల్ వీడియో రావడం,
ఆ వీడియోలో మహేష్ లుక్స్ అండ్ డైలాగ్స్ వెరీ స్టైలిష్ గా ఉండటంతో మొత్తానికి ఈ సినిమాలో మహేష్ లుక్ అదిరిపోయింది అంటూ పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ బాగా యంగ్ గా ఉంది. అయితే, మహేష్ లుక్ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్న దర్శకుడు పరుశురామ్ కి మహేష్ బాబు ఫ్యాన్స్, ఫ్రెండ్స్ నుండి ప్రశంసలు అందుతున్నాయి.
మహేష్ బాబు పుట్టిన రోజు స్పెషల్ గా మిగిలిన స్టార్స్ కూడా మహేష్ కి ప్రత్యేక విషెస్ చెబుతూ మహేష్ లుక్ ను పొగుడుతున్నారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ‘సర్కారు వారి పాట’ షూట్ కి గ్యాప్ ఇచ్చాడు మహేష్. రేపటి నుండి ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో వేసిన భారీ సెట్ లో ఒక సాంగ్ ను షూట్ చేయనున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ సర్కారు వారి పాటను భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.