Sharukh Khan : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి అనితర సాధ్యమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న హీరోలలో ఒకడు షారుఖ్ ఖాన్. ఆరోజుల్లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వల్ల బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ కి పేరు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చే పేరు షారుఖ్ ఖాన్. ఎన్నో రొమాంటిక్ హిట్ సినిమాలతో యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో చెక్కు చెదరని క్రేజ్ సంపాదించుకున్నాడు.
ముఖ్యంగా మన ఇండియన్ సినిమాకి ఇంత పెద్ద ఓవర్సీస్ మార్కెట్ ఉంది అంటే దానికి కారణం షారుఖ్ ఖాన్. ఆయన చేసిన సినిమాలు ఓవర్సీస్ లో అలాంటి ప్రభంజనాలు సృష్టిస్తాయి. అలాంటి బ్రాండ్ ఇమేజి ఉన్న ఈ సూపర్ స్టార్ కి ఒక చెడ్డ అలవాటు ఉంది.దీని గురించి ఆయన అనేక ఇంటర్వ్యూస్ లో అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా షారుఖ్ ఖాన్ ప్రతీ నెల ట్విట్టర్ లో ‘#ASKSRK’ అనే లైవ్ చాట్ సెషన్ ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఈ సెషన్ ద్వారా ఆయన కొంత సమయం అభిమానులతో తన విలువైన సమయాన్ని కేటాయించి తన జీవితం లోని ముఖ్యమైన సంఘటనలను మరియు చెయ్యబొయ్యే సినిమా గురించి చెప్పుకొస్తూ ఉంటాడు.
అయితే రీసెంట్ గా నిర్వహించిన లైవ్ చాట్ సెషన్ లో ఒక అభిమాని మీరు సిగరెట్స్ కాలుస్తారా అని అడిగిన ప్రశ్న కి షారుఖ్ ఖాన్ సమాధానం చెప్తూ ‘రోజుకి నేను వంద సిగరెట్లు తాగుతాను’ అని చెప్పుకొచ్చాడు. అన్నం , నీళ్లు లేకపోయినా ఉండగలను కానీ, సిగరెట్ లేకపోతే మాత్రం ఉండలేను, ఈ అలవాటు ని ఎంత మానుకోవాలి అనుకున్నా నా వల్ల కావడం లేదు, కానీ నాకు చిన్న కొడుకు పుట్టినప్పటి నుండే ఈ అలవాటు ని చిన్నగా మానుకుంటూ వచ్చాను అని చెప్పుకొచ్చాడు షారుఖ్ ఖాన్.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: He is the only star hero who smokes 100 cigarettes a day trying for a guinness record
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com