Vijay Deverakonda Father: విజయ్ దేవరకొండపై కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ సైతం పరోక్షంగా ఒకటి రెండు సందర్భాల్లో ఇదే అభిప్రాయం వెల్లడించారు. తాజాగా విజయ్ దేవరకొండ తండ్రి గోవర్థనరావు ఓ ప్రొడ్యూసర్ ని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు ఖుషి మూవీ సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ ఓ ప్రామిస్ చేశారు. తన రెమ్యునరేషన్ నుండి కోటి రూపాయలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 100 మందికి లక్ష రూపాయల చొప్పున సహాయం చేయన్నట్లు వెల్లడించారు.
లక్ష రూపాయల కోసం అప్లై చేసుకోవాలని ఒక లింక్ షేర్ చేశాడు. విజయ్ దేవరకొండ ట్వీట్ ని కోట్ చేస్తూ ఆహాభిషేక్ పిక్చర్స్ సెటైర్ వేసింది. అదే చేత్తో వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయిన రూ. 8 కోట్లు కూడా ఇవ్వాలని ట్వీట్ చేశాడు. దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మండిపడ్డారు. అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన వ్యవహారం. సినిమాకు వచ్చిన నష్టాలతో హీరోకి ఏం సంబంధం అంటూ కౌంటర్ వేశారు.
అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామాపై విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధనరావు తీవ్ర ఆరోపణలు చేశాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ప్లాప్ కాగా విజయ్ దేవరకొండ సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేశాడు. అలాగే బహుమతిగా ఇచ్చిన ఫ్లాట్ తిరస్కరించారు. ఇక అంతకంటే ఏం చేస్తాడు. డిస్ట్రిబ్యూటర్ కి నష్టపోతే విజయ్ దేవరకొండ ఏం చేస్తాడు. అది నిర్మాతతో తేల్చుకోవాల్సిన విషయం. అభిషేక్ నామా కొన్నాళ్లుగా మమ్మల్ని ఇబ్బందిపెడుతున్నాడు. ఈ విషయం విజయ్ దేవరకొండకు కూడా తెలియదు.
ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించాడు. ఆర్థిక పరమైన వివాదాలు ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి. విజయ్ దేవరకొండను అభిషేక్ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నాడు. అతడి పప్పులేవీ ఉడకవు. ఒకసారి విజయ్ దేవరకొండ మార్కెట్ పడిపోయిందని అంటాడు. మరోసారి అతడి డేట్స్ కావాలి అంటాడు. ప్రస్తుతం విజయ్ మైత్రీ, దిల్ రాజు, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ లో చిత్రాలకు సైన్ చేశాడు. డేట్స్ ఖాళీగా లేవు… అని వెల్లడించారు.