Venky Movie Sister: తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్లతో సమానంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు గుర్తింపు ఉంది. కొందరు సైడ్ పాత్రల్లో చేసిన వారు సెలబ్రెటీలుగా మారిపోయారు. అలా పలు సినిమాల్లో స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగా అవకాశాలు తెచ్చుకున్నారు. అయితే కొందరు నటులు ఒకటి, రెండు సినిమాల్లో నటించి ఫేమస్ అవుతారు. ఆ తరువాత ఇండస్ట్రీ నుంచి మాయమైపోతారు. కానీ అలా వారు నటించిన సినిమాలు వస్తే మాత్రం ఆసక్తిగా కనిపిస్తారు. కొన్ని సినిమాల్లో ఎక్కువగా చెల్లెలు పాత్రలో నటించిన ఓ నటి ఇప్పుడు పరిశ్రమలో పత్తా లేకుండా పోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె లేటేస్ట్ ఫొటోలు సందడి చేస్తున్నాయి.
డైరెక్టర్ శ్రీను వైట్ల కొంతకాలం వరుస హిట్ల సినిమాలు తీశాడు. ఆయన మదిలో నుంచి 2004లో వచ్చిన మాస్ మూవీ ‘వెంకీ’. లవ్, కామెడీ, యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలనం. ఇందులో హీరో రవితేజ, హీరోయిన్ స్నేహతో పాటు మిగతా క్యారెక్టర్లకూ గుర్తింపు ఉంటుంది. ఇందులో వెంకీ చెల్లెలుగా ఓ అమ్మాయి నటించింది. ఆమె పేరు శిరీష. అప్పటి వరకు సీరియళ్లలో కొనసాగిన ఈమె ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తరువాత మళ్లీ ఇండస్ట్రీలో కనపించలేదు.
సినిమాలతో పాటు సీరియళ్లలో నటించిన శిరీష ప్రస్తుతం లేటేస్ట్ ఫోటోలతో ఆకట్టుకుంటోంది. అయితే తనకు ఇండస్ట్రీలో అవకాశాలు పేరిట కొందరు వాడుకున్నారని గతంలో ఈమె సంచలన ఆరోపణలు చేసింది. సినిమాలో నటించాలన్న కోరికతో ఇంట్లో వాళ్లకు చెప్పా పెట్టకుండా వచ్చానని, అయితే అవకాశాలు రాగానే తన జీవితం బాగుపడిందని అన్నారు. కానీ కొందరు అవకాశాలు ఇప్పిస్తానని మోసం చేశారని చెప్పింది. శిరీష వాదనను ఎవరూ పట్టించుకోనట్లు తెలిసింది.
కానీ శిరీష మాత్రం ఇప్పుడు ఎంతో అందంగా మారింది. తన బ్యూటీనెస్ ను పెంచుకొని అవకాశాల కోసం ఎదురుచూస్తు ఉంది. పలు సినిమాల్లో ప్రత్యేక సాంగ్ లో కూడా నటించిన ఈమె సినిమాల్లో ఎలాంటి పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శిరీషకు ఎవరు అవకాశం ఇస్తారో చూడాలి. కొందరు నెటిజన్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు.