Megastar Chiranjeevi: మీరు ఎన్నడూ చూడని ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవి అరుదైన చిత్రాలు… కొన్ని చూస్తే ఆశ్చర్యపోతారు!

1978లో చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైంది. హీరోగా ఎదిగే క్రమంలో విభిన్న పాత్రలు చేశారు. విలన్, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరోగా నటించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టు ఎదిగాడు.

Written By: Shiva, Updated On : September 15, 2023 9:12 am

Megastar Chiranjeevi

Follow us on

Megastar Chiranjeevi: శివశంకర వరప్రసాద్ అనే ఓ మధ్యతరగతి మామూలు యువకుడు ఎవరి అండదండలు లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టాడు. కేవలం తన ప్రతిభతో ఒడిదుడుకులు, ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కుంటూ స్టార్ అయ్యాడు. దశాబ్దాల పాటు వెండితెరపై ఏకఛత్రాధిపత్యం చేసి ఎవర్ గ్రీన్ హీరో అయ్యాడు. చిరంజీవి జీవితం చాలా మందికి స్ఫూర్తి. పట్టుదల ఉంటే లక్ష్యం ఎంతటిదైనా సాధించవచ్చని నిరూపించాడు.

1978లో చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలైంది. హీరోగా ఎదిగే క్రమంలో విభిన్న పాత్రలు చేశారు. విలన్, సపోర్టింగ్ రోల్స్, సెకండ్ హీరోగా నటించాడు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ కెరీర్లో ఒక్కో మెట్టు ఎదిగాడు. 1985 నాటికి చిరంజీవి కమర్షియల్, మాస్ హీరోగా ఎదిగాడు. ఇక 90లలో చిరంజీవి కెరీర్ పీక్స్ కి చేరింది. నెంబర్ వన్ హీరోగా అవతరించాడు.

1992లో నేషనల్ మీడియా కవర్ పేజీలో చిరంజీకి ఫోటో వేశారు. బిగ్గర్ దెన్ అమితాబ్ అనే హెడ్డింగుతో దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో అని ఆర్టికల్ రాశారు. చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ బ్లాక్ బస్టర్ కావడంతో చిరంజీవి రెమ్యూనరేషన్ రూ. 1.25 కోటికి చేరిందట. అమితాబ్ కంటే కూడా చిరంజీవి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని ఆ మ్యాగజైన్ అభిప్రాయపడింది. ఓ రీజనల్ హీరో నేషనల్ హీరో కంటే ఎక్కువ ఛార్జ్ చేయడం చిరంజీవి మేనియాకు నిదర్శనం.

ఇప్పటికీ ఈ తరం హీరోలతో చిరంజీవి పోటీపడుతున్నారు. ఆయన తోటి హీరోల మార్కెట్ చాలా వరకు పడిపోయింది. చిరంజీవి నటించిన సైరా, వాల్తేరు వీరయ్య రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి వరుస చిత్రాలు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో చిరంజీవి నాలుగు సినిమాలు విడుదల చేశారు. ఇటీవల దర్శకుడు వశిష్ట్ తో 157వ చిత్రం ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు…