Samantha: సమంత మయోసైటిస్ బారిన పడ్డానని చెప్పినప్పటి నుండి అభిమానుల్లో ఆందోళన కొనసాగుతోంది. ఈ భయంకర రుగ్మతను సమంత ఎలా ఎదిరిస్తారో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సమంత తనకు మాయోసైటిస్ సోకిందని చెప్పారు కానీ అది ఏ టైప్ అనేది వెల్లడించలేదు. మయోసైటిస్ లో దీర్ఘకాలం వేధించే రకాలు కూడా ఉన్నాయి. అభిమానులు భయపడటానికి కారణం అదే. ఇక సమంత తన అనారోగ్యం గురించి చెప్పి పది రోజులు అవుతుంది.ఈ క్రమంలో సమంత ఎలా ఉన్నారనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. అయితే మయోసైటిస్ బారినపడ్డాక మొదటిసారి సమంత కెమెరా ముందుకు వచ్చారు. ఆమె తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు .

బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన సమంత స్పెక్ట్స్ పెట్టుకున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా చేయాల్సిన పనులు ఆగకూడదు, అంటూ సదరు ఫోటోలకు కామెంట్ యాడ్ చేశారు. పరోక్షంగా తాను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ యశోద ప్రమోషన్స్ లో పాల్గొనడం ఆగదు అని చెప్పారు. నవంబర్ 11న థియేటర్స్ లో మిమ్మల్ని కలుస్తాను అన్నారు. ఇక సమంత లేటెస్ట్ ఫోటోస్ లో చాలా డల్ గా కనిపించారు. మునుపటి ఎనర్జీ ఆమెలో లేదు. సమంత లుక్ చూసి ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో మీకు ఏమీ కాదు. ఆ రుగ్మతను ఎదిరించి మీరు బయటపడతారంటూ ధైర్యం చెబుతున్నారు. కాగా ఈ వారం సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద విడుదల అవుతుంది. పాన్ ఇండియా మూవీగా యశోద 5 భాషల్లో విడుదల కానుంది. సరోగసి ప్రధానంగా మెడికల్ మాఫియా నేపథ్యంలో యశోద తెరకెక్కిన ట్లు సమాచారం. ట్రైలర్ దుమ్మురేపగా అంచనాలు పెరిగిపోయాయి. హాలీవుడ్ స్టంట్ మెన్ ఆధ్వర్యంలో సమంత అడ్వెంచర్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు.

దర్శక ద్వయం హరి-హరీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక రోల్స్ చేశారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా సమంత ఆరోగ్య సమస్యల నేపథ్యంలో ఖుషి మూవీ షూట్ ఆగినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
View this post on Instagram