OG Movie Pre-Release Event : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని LB స్టేడియం లో గ్రాండ్ గా నిర్వహించారు. దురదృష్టం కొద్దీ ఈరోజు భారీ వర్షం పడడంతో ఈవెంట్ క్యాన్సిల్ అవుతుందేమో అని భయపడ్డారు.కానీ వర్షం భారీగా పడుతున్నప్పటికీ కూడా ఈ ఈవెంట్ కి వచ్చిన వేలాది మంది అభిమానులు కదలకుండా ఈ ఈవెంట్ ని చూసారు. అయితే ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ వేరే లెవెల్ జోష్ తో ఈ ఈవెంట్ లో అభిమానుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. అంతే కాదు ఆయన ఓజీ గెటప్ లో కూడా అభిమానులకు దర్శనం ఇచ్చాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ లో ఏమి మాట్లాడాడో ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘నేను నా కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా సినిమా గెటప్ వేసుకొని రాలేదు. ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఇలా చేతిలో కత్తి పెట్టుకొని రావడం చూసారా. కానీ ఈ సుజిత్ నా చేత కత్తి పట్టించి ఇలా రప్పించాడు. ఒక అభిమాని గా వచ్చి అద్భుతమైన సినిమాని తెరకేక్కించాడు. సుజిత్ లాంటి దర్శకుడు ముందే నాకు పరిచయం అయ్యుంటే నేను రాజకీయాల్లోకి వచ్చి ఉండేవాడిని కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.ఇక పోతే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ నేడు ఆలస్యం అవ్వడం తో పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం అక్కడికక్కడే డైరెక్టర్ సుజిత్ పై ఒత్తిడి చేసి ట్రైలర్ వేయించాడు. కానీ ఆన్లైన్ లో ఎప్పుడు విడుదల చేస్తారు అనేదానిపై ఇంకా ఇలాంటి క్లారిటీ రాలేదు.