Prabhas R letter movies: ప్రతీ హీరో కి ఎదో ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలన్నీ కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తుంటాయి. అలా రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో కూడా ఒక బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఆయన సినిమాల్లో ఇంగ్లీష్ అక్షరం ‘R’ తో మొదలైన ప్రతీ సినిమా కమర్షియల్ గా దారుణంగా దెబ్బతిన్నాయి. మొదటి సినిమా ‘ఈశ్వర్’ యావరేజ్ రేంజ్ లో ఆడింది. ఆ తర్వాత విడుదలైన రెండవ చిత్రం ‘రాఘవేంద్ర’ కనీసం వారం రోజులు కూడా థియేటర్స్ లో నిలబడలేకపోయింది. ఇంతటి ఘోరమైన ఫ్లాప్ ప్రభాస్ కెరీర్ లోనే లేదని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆ చిత్రానికి కనీసం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు కూడా రాలేదు. మళ్లీ R అక్షరం తో ప్రభాస్ నుండి మరో సినిమా రావడానికి చాలా సమయమే పట్టింది.
‘బాహుబలి’ సిరీస్, సాహూ తర్వాత ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చిత్రం చేసాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఎంత పెద్ద ఫ్లాప్ అంటే, ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా వంద కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది , ఒక్క ‘రాధే శ్యామ్’ తప్ప. దీనిని బట్టీ ఏ రేంజ్ ఫ్లాప్ అనేది మీరే అర్థం చేసుకోండి. ఇక రీసెంట్ గా విడుదలైన ‘రాధే శ్యామ్’ చిత్రం కూడా R అనే పదం తో మొదలు అవుతుంది. ఈ సినిమా ఫలితం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కల్కి చిత్రం తో వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ప్రభాస్ నుండి ఇలాంటి నాసిరకపు సినిమాని చూడలేదంటూ సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఈ సినిమా నాలుగు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంది కానీ, కమర్షియల్ గా మాత్రం బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
దీంతో ప్రభాస్ అభిమానులు భవిష్యత్తులో R అనే పదంతో మరో టైటిల్ రాకూడదని బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రం చేస్తున్నాడు. ఆ తర్వాత ‘కల్కి 2’, ‘సలార్ 2’ చిత్రాలు చేస్తాడు. మధ్య లో ‘fauji’ కూడా ఉంది. దరిదాపుల్లో మళ్లీ R అనే పదం కనిపించడం లేదు. అందుకు ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఇకపోతే ప్రభాస్ స్పిరిట్ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ‘కల్కి 2’ చిత్రాన్ని వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది.