Tollywood After Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎల్లలు దాటుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ వరల్డ్ స్థాయికి మన సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ తో తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వెళ్తుందో ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. మన వాళ్లు చేస్తున్న సినిమాలు ఇండియాలో భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ లో నిలుపుతున్నారు…అయితే గత ఎనిమిది నెలల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు.గత సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన రిలీజ్ అయిన పుష్ప 2 సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక ఎప్పుడైతే ఆ సినిమా వచ్చిందో దాని తర్వాత నుంచి వచ్చిన ఏ సినిమాలు కూడా ఆశించైనా మేరకు సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి.
స్టార్ హీరోలందరు వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నప్పటికి అవేవీ సక్సెస్ లను సాధించడం లేదు. మరి ఇకమీదటైనా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక భారీ సక్సెస్ ని సాధించి పెట్టాల్సిన అవసరం అయితే మన హీరోల మీద ఉంది. మరి పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి సినిమా తోనే ఇది సాధ్యమవుతుందని చాలామంది భావిస్తున్నారు.
Also Read: ఇండియాలో ఈ సంవత్సరం 1000 కోట్లు వసూలు చేసిన సినిమాలేంటో తెలుసా..?
సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజి సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తోందా? తద్వారా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఈ సినిమా ఒక భారీ సక్సెస్ గా నిలుస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది…నిజానికైతే తెలుగు సినిమా బాక్సాఫీస్ ని కాపాడాలంటే అది పవన్ కళ్యాణ్ వల్లే అవుతుందని చాలామంది భావిస్తున్నారు.
ఇక హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఆయన ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ ని చేయలేకపోయాడు. కానీ గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఓజి సినిమాతో మాత్రం పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తాడు అనేది వాస్తవం… ఇక వాళ్ళందరూ అనుకున్నట్టుగానే ఓజీ సినిమా ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…