1000 crore Indian Movies: గత కొన్ని సంవత్సరాల నుంచి వివిధ భాషల హీరోలు సైతం పాన్ ఇండియా సినిమాలను చేసి భారీ సక్సెస్ లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇప్పటివరకు తెలుగు సినిమాలు పాన్ ఇండియాలో పెను ప్రభంజనాలను సృష్టిస్తూ రికార్డులను సైతం కొల్లగొడుతున్నాయి. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సంవత్సరంలో ఇప్పటివరకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ను వసూల్ చేసిన సినిమాలు ఎన్ని ఉన్నాయి అని ఆరా తీస్తే కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ‘చావా’ సినిమా ఒకటే 1000 కోట్ల కలెక్షన్స్ కి కొల్లగొట్టింది. ఈ సంవత్సరం లో ఇప్పటికే 8 నెలలు గడిచిపోయింది. మరి ఎనిమిది నెలల నుంచి 1000 కోట్ల సినిమా ఒక్కటే రావడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నిజంగా చాలా బాధను కలిగించే విషయం అనే చెప్పాలి. ఇప్పటికే పాన్ ఇండియాలో వస్తున్న భారీ సినిమాలన్నీ వెయ్యి కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా పెట్టుకొని వస్తున్నప్పటికి ఆ సినిమాలేవి ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ప్రేక్షకులు ఆ సినిమాలను చూడడానికి ఆసక్తి చూపించడం లేదు…దాంతో ఎవరికి వారు 1000 కోట్ల టార్గెట్ పెట్టుకున్నప్పటికి అది కలగానే మిగిలిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇక మీదట రాబోయే సినిమాలతో అయిన ఇండియన్ సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఇక తెలుగులో ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు ఈ సంవత్సరం ఎంట్రీ ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా 1000 కోట్ల మార్కును టచ్ చేయలేకపోయారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా 1000 కోట్లను దాటుతుంది అంటూ అనౌన్స్ చేసినప్పటికి అది ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు.
Also Read: కూలీ సినిమా కోసం రజినీకాంత్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
దాంతో కేవలం 400 కోట్ల మార్కు దగ్గరే ఆగిపోయింది… పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాతో అలరించాడు. అయినప్పటికి ఆ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పాలి. ‘కింగ్డమ్’ సినిమాతో విజయ్ దేవరకొండ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేశాడు అది కూడా ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించలేదు.
ఇక ఇప్పుడు హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కలిసి చేసిన ‘వార్ 2’, అలాగే రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు కూడా ఆశించిన మేరకు సక్సెస్ ఫుల్ టాక్ ను తెచ్చుకోలేకపోయాయి. కాబట్టి ఈ రెండు సినిమాలు కూడా వెయ్యి కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టడం అనేది అసాధ్యమనే చెప్పాలి…